కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అతడి భార్యను విచారించగా ఓ దారుణ విషయ తెలిసింది. ఆమె చెప్పింది విని పోలీసులే షాక్ అయ్యారు. ఫిబ్రవరి 21న జరిగిన సంఘటనను ఆమె పోలీసులకు వివరించింది.
భార్యాభర్తల మధ్య సంబంధాలు పేక మేడల్లా మారుతున్నాయి. కలకాలం నిలవాల్సిన బంధాలు మూడు నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. భార్య మీద కోపంతో భర్త.. భర్త మీద కోపంతో భార్య దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా, ఓ మహిళ తనను ఇబ్బంది పెడుతున్నాడన్న కారణంతో భర్తను దారుణంగా హత్య చేసింది. అతడికి నిద్ర మాత్రలు ఇచ్చి, గొడ్డలితో నరికి చంపింది. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మధ్య ప్రదేశ్‌లోని బదర్‌గాటా గ్రామానికి చెందిన బిరేంద్ర గుజర్ ఫిబ్రవరి 21న తన ఇంటికి దూరంగా శవమై తేలాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అతడి శరీరంపై, మర్మాంగంపై భారీ గాయాలను గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, ఆమె ఎవరో గుర్తు తెలియని వ్యక్తిపై కేసు పెట్టింది. అయినప్పటికి పోలీసులు విచారణను ప్రారంభించారు. బిరేంద్ర కుటుంబసభ్యులు, బంధువులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే బిరేంద్ర భార్యను కూడా విచారించారు. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పటంతో పోలీసులకు అనుమానం వచ్చింది.
ఆమెను తమదైన స్టైల్లో విచారించారు. దీంతో అసలు విషయం బయటపెట్టింది. భర్త తనను వేధిస్తున్నందుకు గాను అతడ్ని హత్య చేశానని తెలిపింది. తన భర్త తాగి తరచుగా వేధిస్తూ ఉంటాడని అంది. అందుకే తినే అన్నంలో 20 నిద్ర మాత్రలు కలిపిపెట్టానని, తర్వాత గొడ్డలితో నరికి హత్య చేశానని అంది. అంతేకాదు! అతడి మార్మాంగాన్ని సైతం వేరు చేసినట్లు తెలిపింది. ఆ తర్వాత శవాన్ని ఇంటికి దూరంగా పడేశానని పేర్కొంది. కాగా, ఆమె నిందితుడికి ఐదో భార్య కావటం గమనార్హం. అతడి వేధింపుల కారణంగా నలుగురు విడిచి వెళ్లిపోయారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.