ఈ మద్య భార్యాభర్తల మద్య చిన్న చిన్న వివాదాలు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునేంత వరకు వెళ్తున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చు రేపుతున్నాయి. పెద్దల సాక్షిగా వివాహబంధంతో ఒక్కటైన జంట ఒక్క ఏడాదిలోనే మనస్ఫర్ధలు రావడంతో విడిపోతున్నారు. కొన్ని చోట్ల భార్యాభర్తలు అక్రమసంబంధాల మోజులో పడి ఒకరినొకరు చంపుకుంటున్నారు. కట్టుకున్న భర్త సోదరుడితో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను అతి దారుణంగా చంపి గడ్డివాములో సంవత్సరం దాచింది.. చివరికి పాపం పండి చేసిన చిన్న పొరపాటు వల్ల పోలీసులకు దొరికిపోయింది ఓ భార్య. ఈ ఘటన మద్యప్రదేశ్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
మద్యప్రదేశ్ కి చెందిన రామ్ సుశీల్ అనే వ్యక్తి పది సంవత్సరాల క్రితం రంజన అనే మహిళలను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లై పదేళ్లు గడుస్తున్నా వీరికి సంతానం లేదు. ఈ క్రమంలోనే సుశీల్ సోదరుడైన గులాబ్ తో రంజన అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇంట్లో సుశీల్ లేని సమయంలో గులాబ్ ని పిలిచి అతనితో రాసలీల్లో మునిగిపోయేది. వీరి అక్రమ సంబంధం గురించి రామ్ సుశీల్ కి తెలియడంతో ఇద్దరినీ గట్టిగా మందలించాడు. దీంతో తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని.. అతని అడ్డు తొలగించేందుకు ఓ పథకం వేశారు. ఇక సోదరుడి అడ్డు తొలగించుకుంటే అతని ఆస్తి కూడా కలిసి వస్తుందని గులామ్ హత్యకు పక్కా ప్లాన్ వేశాడు. గత ఏడాది సుశీల్ కి రంజన సమోసాలో ఎలుకల మందు కలిపి తినిపిస్తుంది. సమోసాలు తిన్న కొద్ది సేపటికి సుశీల్ మరణిస్తాడు. గులాబ్, రంజన కలిసి ఆ మృతదేహాన్ని ఇంటి ఎదురుగా ఉన్న గడ్డివాములో దాచడంతో ఎవరూ గమనించలేకపోయారు.
ఏడాది తర్వాత గడ్డివాములో సుశీల్ అస్థిపంజరం గమనించి దానిని తీసుకు వెళ్లి అడవిలో పడవేశారు గులాబ్, రంజన. చేసిన పాపం ఎప్పటికైనా పండుతుందన్నట్లుగా కొద్ది రోజుల తర్వాత పోలీసులకు అస్థిపంజరం దొరకడంతో దానికి డీఎన్ఏ టెస్ట్ చేయించారు. ఆ తర్వాత మౌగంజ్‌లో పరిసర ప్రాంతంలో విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో రామ్ సుశీల్ అనే వ్యక్తి గత ఏడాది నుంచి కనిపించడం లేదన్న విషయం బయటపడింది. అయితే గ్రామస్థుల ద్వారా రామ్ సుశీల్ భార్య రంజనకు అతని సోదరుడు గులాబ్ తో వివాహేతర సంబంధం ఉందన్న విషయం పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు తమదైన స్టైల్లో ఇద్దరినీ ప్రశ్నించడంతో అసలు నిజాన్ని బయట పెట్టారు. కేసు నమోదు చేసుకొని వారిద్దరినీ పోలీసులు రిమాండ్ కి పంపించారు.