కొన్నిఘటనలు హృదయాలను కలచివేస్తే, మరికొన్ని ఘటనలు గుండెలు బరువెక్కేలా చేస్తాయి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి ప్రాణం ఎప్పుడు, ఎక్కడ పోతుందో ఎవరికీ తెలియదు. అలా ఎప్పుడు చనిపోతామో తెలియని ఈ బతుకులకు కొందరు విషపు ఆలోచనలు చిమ్మకుంటూ విర్రవీగి ప్రవర్తిస్తుంటారు. సరిగ్గా ఇలాగే ఓ వైద్యుడు ప్రవర్తించడంతో చివరికి ఓ చిన్నారి మరణానికి కారణమయ్యాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ హృదయ విదారక ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందనే వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ లోని సంజయ్ పాండే ప్రాంతంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 5 ఏళ్ల రిషీ అనే చిన్నారి ఉంది. అయితే ఇటీవల ఆ చిన్నారి ఆరోగ్యం క్షణించడంతో తల్లిదండ్రులు హుటాహుటిన స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. వైద్యుడి కోసం గంటల తరబడి అక్కడే వేయిట్ చూశారు. కానీ గంటలు గడిచినా.. సకాలంలో ఆ వైద్యుడు మాత్రం రాలేదు. దీంతో ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చివరికి తల్లి ఒడిలోనే ఆ పాప కన్నుమూసింది. కూతురు మరణించడంతో తల్లి కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఈ విషయం పై అధికారుల వరకు వెళ్లడంతో ఆ వైద్యుడిని ఎందుకు ఆలస్యంగా వచ్చారు అని ప్రశ్నించగా.. నా భార్య ముందు రోజు ఉపవాసం ఉందని, దాని కారణంగానే డ్యూటీకి కాస్త ఆలస్యంగా రావాల్సి వచ్చిందని తెలిపాడు. వైద్యుడు చెప్పింది విని వైద్యాధికారులు ఒక్కసారిగా షాక్ కు తిన్నారు. అనంతరం అధికారులు అతనిపై చర్యలకు సిద్దమైనట్లుగా తెలుస్తోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.