మరికొద్దిసేపట్లో పెళ్లి, వధూవరులు మండపానికి చేరుకున్నారు. అక్కడికి బంధువులంతా రావడంతో అంతా సందడిగా మారింది. ఇక తాళికట్టే సమయానికి వధూవరులు విషం తాగారు. అసలేం జరిగిందంటే?
కాసేపట్లో పెళ్లి. మండపంలో ఇరువురి బంధువులు హాజరవ్వడంతో అంతా సందడిగా మారింది. ఒక పక్క భోజనాలు కూడా గుమగుమలాడున్నాయి. వేదికపైకి వరుడు, వధువు చేరుకున్నారు. మరికొసేపట్లో తాళి కడతాడనే సమయానికి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పెళ్లిలోనే వధూవరులు విషం తాగారు. హుటాహుటిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఫలితం లేకపోవడంతో వరుడు మరణించగా, వధువు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. ఇంతకు వీళ్లు ఎందుకు విషం తాగారు? అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓ ప్రాంతానికి చెందని యువతి, యువకుడికి ఇరువురి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. దీంతో మంగళవారం పెళ్లి కావడంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బంధువులంతా మండపానికి చేరుకున్నారు. పిల్లలు, పెద్దలతో అంతా హడావిడిగా మారిపోయింది. ఇక మరికాసేపట్లో పెళ్లి అనగా.. మండపం దగ్గరే వధూవరులు గొడవ పడ్డారు. ఇదే కోపంతో ముందుదా వరుడు విషం తాగాడు. ఈ విషయం తెలుసుకున్న వధువు కూడా పాయిజన్ తాగింది. దీంతో వెంటనే స్పందించిన ఇరువురి కుటుంబ సభ్యులు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఫలితం లేకపోవడంతో వరుడు మరణించగా, వధువు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వరుడి మృతదేహాన్ని పరామర్శించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే? గత కొన్ని రోజుల నుంచి వధువు వరుడిని తొందరగా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం మొదలు పెట్టింది. దీనికి వరుడు మాత్రం.. నాకు రెండేళ్ల టైమ్ కావాలని, ఆ తర్వాత పెళ్లి చేసుకుందామంటూ వివరించే ప్రయత్నం చేశాడు. అయినా వెనకడుగు వేయని వధువు.. ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఇరువురి నిర్ణయం మేరకు మంగళవారం పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక కాసేపట్లో పెళ్లి అనగా ఇదే విషయంపై వధూవరులు మరోసారి గొడవ పడి విషం తాగారు. ఈ విషయం తెలిసి బంధువులంతా షాకయ్యారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.