పైన ఫోటోలు ఉన్న ఈ మహిళను చూశారా? వాళ్ల ఊరి బాధనంత ఒక్కతే భరిస్తున్నట్లు కనిపిస్తుంది. పాపం ఈ మహిళకు ఏదో అన్యాయం జరిగిందని మాత్రం కాస్త జాలి చూపులతో చూడకండి. ఈ కిలాడీ లేడీ చేసిన కిరాతం వింటే మీరు కూడా ఇదేం పని ఆంటీ అంటారు. అవును మీరు విన్నది కరెక్టే. అసలు ఈ మహిళ చేసిన తప్పేంటనే కదా మీ ప్రశ్న. అయితే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే. ఈ మహిళ పేరు సావిత్రి. మధ్యప్రదేశ్ లోని మిర్జాపూర్ గ్రామానికి చెందిన ఈమెకు బల్లూ అనే వ్యక్తితో గతంలో వివాహం జరిగింది. కొంత కాలం భర్తతో పాటు సావిత్రి కాపురాన్ని బాగానే చక్కదిద్దింది. కానీ రోజులు మారే కొద్ది ఆమెలో దాగిఉన్న అసలు రూపాన్ని బయటపెట్టింది.
భర్త సరిపోక స్థానికంగా ఉండే రక్వర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. అలా భర్తకు తెలియకుండా సావిత్రి కొంతకాలం తన చీకటి కాపురాన్ని ప్రియుడితో మూడు పువ్వులు, ఆరు కాయలు అనే విధంగా ఘనంగా తీర్చుదిద్దుకుంటోంది. ఈ క్రమంలోనే భార్య సాగిస్తున్న అక్రమ సంబంధం వ్యవహారం మెల్ల మెల్లగా భర్త చెవిన పడింది. దీంతో భర్త భార్యకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. దీంతో భర్త ముందు తలదించలేక ప్రియుడితో ఉండలేక సావిత్రి నలిగిపోతూ ఉంది.
ఇది కూడా చదవండి: Nalgonda: పాపం.. ఈ చిన్నారి మరణించిన తీరు చూస్తే గుండె బరువెక్కుతోంది!
ఇక రెండు రోజుల తర్వాత భర్తకన్న ప్రియుడే ఎక్కువనుకుంది. దీంతో ఎలాగైన భర్తను ప్రాణాలతో లేకుండా చేసి ప్రియుడితో ఉండాలని బలంగా అనుకుంది. ఇందులో భాగంగానే సావిత్రి ప్లాన్ ప్రకారమే భర్తకు మద్యం తాగించి ప్రియుడితో పాటు భర్తను గొంతు కోసి దారుణంగా హత్య చేసింది. దీంతో వెంటనే నా భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు సైతం కంప్లెంట్ చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులకు మరుసటి రోజే సావిత్రి భర్త ఓ చోట శవమై కనిపించాడు.
దీంతో పోలీసులు ఏం జరిగిందంటూ భార్యను విచారించారు. భార్య పొంతనలేని సమాధానాలు చెప్పి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయబోయింది. ఇక అనుమానం వచ్చిన పోలీసులు భార్యను గట్టిగా అడిగే సరికి అసలు విషయం బయటకు కక్కి నా భర్తను ప్రియుడితో పాటు నేనే హత్య చేశానని అసలు గుట్టు విప్పింది. వెంటనే సావిత్రితో పాటు ఆమె ప్రియుడు రక్వర్ ను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.