దేశంలో హత్యలు, అత్యాచార ఘటనలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు రూపొందించినా.. దుర్మార్గుల ఆలోచనల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. తల్లిని, చెల్లిని ఇలా.. వావివరసుల మరిచి బరితెగించి ప్రవర్తిస్తూ చివరికి అత్యాచారాలు చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనలోనే ఓ 16 ఏళ్ల కుర్రాడు 58 ఏళ్ల మహిళను అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మధ్యప్రదేశ్ రేవా జిల్లా హనుమాన పరిధిలోని కైలాష్ పురి గ్రామంలో 16 ఏళ్ల బాలుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు చదువు మానేసి జులాయిగా తిరుగుతుండేవాడు. అయితే ఈ కుర్రాడు గతంలో స్థానికంగా ఉండే ఓ 58 ఏళ్ల మహిళ ఇంట్లో మొబైల్ ఫోన్ దొంగిలించినట్లుగా తెలుస్తుంది. దీంతో ఆ ఇంటి మహిళ.. ఆ బాలుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఇక అందరి ముందు అతడి పరువు తీసి దొంగతనం చేశాడంటూ అభియోగం మోపింది. దీంతో అప్పటి నుంచి ఆ బాలుడు ఆ మహిళపై పగతో రగిలిపోయాడు. ఎలాగైన ఆ మహిళపై పగ తీర్చుకోవాలనుకున్నాడు.
ఆ బాలుడు సమయం కోసం గత రెండేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాడు. ఇదిలా ఉంటే గత నెల 30న ఆ మహిళ ఇంట్లో ఒంటరిగా నిద్రపొయి ఉంది. ఇదే మంచి సమయం అనుకున్న ఆ బాలుడు… ఆ మహిళ ఇంట్లోకి వెళ్లాడు. వెళ్తు వెళ్తునే నిద్రలో ఉన్న ఆ మహిళ నోట్లో గుడ్డలు కుక్కి ముఖంపై ప్లాస్టిక్ కవర్ చుట్టాడు. ఆ తర్వాత ఆమెను పక్కనే నిర్మాణం జరుగుతున్న భవనంలోకి తీసుకెళ్లాడు. అనంతరం ఆమె చేతులు, కాళ్లు తాళ్లతో కట్టేసి దారుణంగా కొట్టి చంపాడు. ఇంతటితో ఆగని ఆ దుర్మార్గుడు.. ఆ మహిళపై అత్యాచారం కూడా చేసి మెడలోని బంగారు గొలుసులు, రూ. 1000 నగదు తీసుకుని పరారయ్యాడు.
ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఆ మహిళ మృతదేహాన్ని ఆ కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు విచారణలో మాత్రం… నేను దొంగతనం చేయలేదని, అనవసరంగా నన్ను దొంగగా చిత్రీకరించి నా పరువు తీశారని, దీని కారణంగానే ఆమెను చంపి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నానని ఆ బాలుడు వివరించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.