ఈ మధ్యకాలంలో పెళ్లైన చాలా మంది మహిళలు తాళికట్టిన భర్తను కాదని పరాయి వాడి కోసం తహతహలాడుతున్నారు. వివాహేతర సంబంధాల కోసం పచ్చని కాపురాన్ని నిట్టనిలువునా చీల్చేసుకుంటున్నారు. భర్తను కాదని భార్య, భార్యని కాదని భర్త.., ఇలా ఒకరిని కాదని మరొకరు అక్రమ సంబంధాల మోజులో పడి చివరికి ఎటుకాకుండా పోతున్నారు. అచ్చం ఇలాగే భర్తను కాదని ఓ మహిళ ప్రియుడితో లేచిపోయింది. అనంతరం భర్త ఇంట్లో ప్రియుడితో కాపురం పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త భార్యకు ఊహించని షాకిచ్చాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
మధ్యప్రదేశ్ రత్లామ్ జిల్లా తారాగఢ్ గ్రామంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల కాపురం బాగానే సాగింది. అలా వీరి కాపురం సాగుతున్న తరుణంలో భార్య పక్క చూపులు చూసింది. దీంతో స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. అలా కొన్నాళ్ల పాటు ఆ మహిళ భర్తకు తెలియకుండా ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ వచ్చింది. కానీ రాను రాను ఆ మహిళకు భర్తతో ఉండడం కంటే ప్రియుడితో ఉండేందుకే ఇష్టపడింది.
దీంతో ఇటీవల ఆ మహిళ భర్తను కాదని ప్రియుడితో వెళ్లిపోయింది. ఇక పరువు పోయిందని అనుకున్న భర్త భార్యపై కోపంతో ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. ఇక ఈ విషయం తెలుసుకున్న భార్య ప్రియుడితో వచ్చి ఏకంగా భర్త ఇంట్లోనే కాపురం పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త తన భార్య ఉంటున్న ఇంటికి వెళ్లాడు. భార్యను బయటకు తీసుకొచ్చి ఓ చెట్టుకు కట్టేశాడు. అనంతరం ఆమెపై అత్తింటి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. రక్తం వచ్చేలా కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను రక్షించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.