మధ్య ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. బాధితురాలిని బెదిరించి దుర్మార్గుడు విర్రవీగి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది వరకే అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవించిన ఈ కిరాతకుడు మరోసారి అదే మహిళపై అత్యాచారం చేయడం అనేది స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. వివరాల్లోకి వెళ్తే.. జబల్‌పూర్ జిల్లాలో ఓ యువతికి 19 ఏళ్ల వయసున్నప్పుడు వివేక్ పటేల్ అనే నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై స్పందించిన న్యాయస్థానం అతనికి జైలు శిక్ష విధించింది.
ఇక ఏడాది కాలం పాటు జైలు జీవితం గడిపిన వివేక్ పటేల్ ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చాడు. అయితే ఇతగాడు వస్తూ వస్తూనే మొదటగా అత్యాచారం చేసిన యువతిపై పగతో రగిలిపోయాడు. అయితే ఇటీవల వివేక్ పటేల్ ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండగా కత్తితో బదిరించి తన స్నేహితులతో కలిసి మరోసారి అత్యాచారం చేశారు. ఇంతటితో ఆగకుండా ఈ దారుణాన్ని వీడియోలు తీసి తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోకపోతే ఈ వీడియెలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ కు దిగాడు.
దీంతో బాధితురాలు మరోసారి పోలీసులను ఆశ్రయించి తనపై జరిగిన దారుణాన్ని వివరించి.., వివేక్ పటేల్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశంగా మారుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.