చదువు చెప్పాల్సిన కొందరు గురువులు కామంతో రెచ్చిపోతూ విద్యార్థినిలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది మధ్య ప్రదేశ్ లోని బేతుల్ ప్రాంతం. స్థానికంగా ఉండే ఓ పాఠశాలలో ఓ యువకుడు టీచర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే అదే పాఠశాలలో చదువుతున్న ఓ బాలికపై ఈ కీచక మాస్టారు కన్నేశాడు.
ఇక ఇంతటితో ఆగకుండా ప్రైవేటు క్లాసులంటూ ఆ విద్యార్థినికి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. అలా రోజూ ప్రైవేట్ క్లాస్ పేరిట ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడేవాడు. అలా కొన్నిరోజుల తర్వాత బాలిక ఆరోగ్యంలో మార్పులొచ్చాయి. వైద్యుల వద్దకు వెళ్తే గర్భవతి అని తెలిసింది. దీంతో ఆ కీచక టీచర్ కు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ బాలిక తల్లిదండ్రులను బెదిరించి ఓ ఆస్పత్రిలో అబర్షాన్ చేయించాడు.
ఇది కూడా చదవండి: టీచర్‌పై వ్యామోహం.. బాత్ రూమ్‌లో ఉండగా వీడియోలు తీసిన విద్యార్థి!
ఎవరికైన చెబితే బాగుండదంటూ హెచ్చరించాడు. ఇక ఎట్టకేలకు చివరికి ఈ విషయం పోలీసుల వరకు చేరడంతో నిందితుడితో పాటు అబార్షన్ చేసిన వైద్యుడిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.