పెళ్లైన కొందరు వివాహితలు భర్తను కాదని పరాయివాడితో వివాహేతర సంబంధాన్ని నడిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో చివరికి తన చీకటి కాపురానికి అడ్డొచ్చిన భర్తను కాదని అవసరమైతే హత్య అతనినే హత్య చేయటానికి కూడా వెనకాడని పరిస్థితులను సృష్టించుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ వివాహత తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఏకంగా భర్తనే అంతమొందించి. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతర్ పూర్ లో దౌరియా గ్రామం. ఇదే గ్రామానికి చెందిన యువతి పక్కింట్లో ఉండే ఓ యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉండేది. దీంతో అనుమానమొచ్చిన ఆ యువతి తల్లిదండ్రులు వెంటనే ఆ యువతికి పెళ్లి చేశారు. ఇక పెళ్లై నెలలు గడుస్తున్నా వీరిద్దరి లోలోపల సంసారం మాత్రం ఇంకా నడుస్తూనే ఉంది. ఓ రోజు భర్తకు అనుమానమొచ్చి ఇదేంటని భార్యను ప్రశ్నించాడు. దీంతో ఖంగుతిన్న భార్య వెంటనే ప్రియుడికి కబురు పంపి ఇలా అయితే కాదని భావించి భర్త హత్యకు ప్లాన్ వేసింది.
ఇది కూడా చదవండి: పెళ్లికొడుకు ప్రాణం తీసిన శోభనం..! ఆరోజు ఏమైందంటే?
అనుకున్నట్లుగానే వీరి పథకం ప్రకారం భర్తను ఓ చోటుకు రమ్మన్నారు. దీంతో నమ్మిన భర్త అక్కడికి వెళ్లాక మద్యం తాగించారు. ఇక భర్త మత్తులోకి జారుకున్నాక ఆ మహిళ ప్రియుడు గన్ తో కాల్చి హత్య చేశాడు. దీంతో భర్త మృతదేహాన్ని గొయ్యి తవ్వి అందులో పూడ్చి పెట్టారు. దీంతో అనుమానమొచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి నిందితులు పట్టుకున్నారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.