Note On Wall: అత్తింటి వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తన వేధింపుల తాలూకూ ఆవేదనను ఇంటి గోడపై సూసైడ్ నోట్ రూపంలో రాసింది. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లోని గుణలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మధ్య ప్రదేశ్, గుణలోని కుంభరాజ్‌కు చెందిన జ్యోతి అగర్వాల్ అలియాస్ ఉమకు 11 నెలల క్రితం ఫతేఘర్‌కు చెందిన దీపక్ అగర్వాల్‌తో పెళ్లయింది. ఇద్దరికీ ఇది రెండో వివాహం. ఉమకు మొదటి వివాహం కారణంగా ఓ బాబు ఉన్నాడు. రెండో పెళ్లయి అయిన తర్వాత భార్యభర్తలిద్దరూ కొన్ని రోజులు అన్యోన్యంగా ఉన్నారు. దీప్‌క్‌కు అదే ప్రాంతానికి చెందిన హీనా అనే మహిళతో అక్రమ సంబంధం ఉందని తెలియటంతో.. ఇద్దరి మధ్యా గొడవలు మొదలయ్యాయి.
ఇదే విషయంపై నాలుగు నెలల క్రితం ఇద్దరి మధ్యా గొడవలు జరగటంతో దీపక్.. ఉమను ఇండోర్‌లోని ఆమె తమ్ముడి దగ్గరకు పంపేశాడు. ఎనిమిది రోజుల క్రితం పిల్లాడికి పరీక్షలు ఉన్నాయంటూ వెనక్కు పిలిపించాడు. శుక్రవారం సాయంత్రం ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే శనివారం ఉమ ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ఇంటి గోడపై ఓ సూసైడ్ నోట్ రాసింది. తాను ఇన్నిరోజులు ఎదుర్కొన్న బాధను అందులో రాసుకొచ్చింది. ఆ నోట్‌లో…
‘‘తమ్ముడూ.. వీళ్లంతా మంచోళ్లు కాదు! నా చావుకు నా భర్తే కారణం. అతడ్ని కఠినంగా శిక్షించండి. నా భర్తతో సంబంధం పెట్టుకున్న హీనా కూడా నా చావుకు కారణమే’’ అని పేర్కొంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉమ తమ్ముడ్ని, నిందితులను విచారించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Designer Prathyusha: ప్రత్యూష ఆత్మహత్య కేసు.. దర్యాప్తులో వెలుగు చూస్తున్న సంచలన విషయాలు..