మధ్యప్రదేశ్ లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. అత్తమామలు కోడలు 8 నెలల గర్భిణీ అని చూడకుండా దారుణంగా హత్య చేశారు. ఇక ఇంతటితో ఆగకుండా కోడలి కడుపు బ్లేడుతో చీల్చారు. అనంతరం అందులో ఉన్న బిడ్డను తీసి ఆపై తల్లీబిడ్డను ఎవరికి తెలియకుండా వేర్వేరుగా ఖననం చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ జబల్పూర్ పరిధిలోని పనా నగర్ లో గోపి, రాధ దంపతులు నివాసం ఉంటున్నారు.
వీరికి గతేడాది ఏప్రిల్ 24న వివాహం జరిగింది. అయితే పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. కానీ కొంత కాలంగా భర్త కొత్త బైక్ తెచ్చుకోవడానికి రాధను అదనపు కట్నం తేవాలని భర్తతో పాటు అత్తమామలు వేధించారు. అలా రోజు రాధను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ తీవ్ర హింసకు గురి చేసేవారు. ఇదే విషయంపై రాధ తల్లిదండ్రులు అనేక సార్లు కూతురి అత్తమామలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా భర్త, అత్తమామల తీరులో మాత్రం మార్పు రాలేదు.
అలా రోజులు గడుస్తున్న క్రమంలోనే రాధ 8 నెలల గర్భవతి అయింది. ఇక ఈ క్రమంలోనే అత్తమామల అరాచకం మళ్లీ మొదటికి వచ్చింది. కానీ అత్తమామలు ఈసారి ఊహించిన కిరాతకానికి పాల్పడ్డారు. అదనపు కట్నం కోసం అత్తమామలు కోడలు రాధతో గొడవకు దిగారు. ఇక పట్టరాని కోపంతో ఊగిపోయిన రాధ అత్తమామలు కోడలిని దారుణంగా హత్య చేశారు. ఇక అత్తమామల దాడిలో కోడలు ప్రాణాలు విడిచింది. అనంతరం అత్తమామలు కోడలు 8 నెలల గర్భిణీ కావడంతో బ్లేడుతో కోడలి కడుపును చీల్చారు.
అనంతరం ఆమె గర్భంలో చనిపోయిన ఆ పసిబిడ్డను సైతం బయటకు తీసి తల్లి బిడ్డను వేర్వేరు చోట ఖననం చేశారు. రెండు మూడు రోజుల తర్వాత ఈ దారుణ ఘటన విషయం రాధ తల్లిదండ్రులకు తెలిసింది. విషయం తెలియగానే రాధ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం రాధ భర్త, అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులైన అత్తమామలను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే వీరి చేసిన కిరాతకం నిజమేనని విచారణలో తేలడంతో పోలీసులు రాధ అత్తమామలను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.