CRIME NEWS: ఓ రౌడీ బెదిరింపుల కారణంగా ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వేధింపులు తట్టుకోలేక పెళ్లికి ఓ రోజు ముందు చెరువులో దూకి ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మధ్య ప్రదేశ్, చట్టర్‌పుర్ జిల్లా, చట్టర్‌పుర్‌కు చెందిన నీలు బన్‌స్కర్‌ను అదే ప్రాంతంలో ఉండే రాహుల్ అనే రౌడీ ప్రేమిస్తున్నాడు. ప్రేమ పేరుతో గతకొన్ని నెలలుగా వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నీలు తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి నిశ్చయం చేశారు. మే 15న పెళ్లి వేడుక జరగనుంది. 14వ తేదీ బంధువులు మొత్తం ఇంటికి చేరుకున్నారు. పెళ్లి సందడి మొదలైంది. నీలుకు పెళ్లి కుదిరిందని తెలుసుకున్న రాహుల్ పెళ్లికి రెండు రోజుల ముందు వారి ఇంటికి వచ్చాడు. ‘‘నువ్వు వేరే వాడ్ని పెళ్లి చేసుకుంటే వాడిని పెళ్లి మండపంలోంచి బయటకు రాగానే చంపేస్తా’’ అంటూ నీలును చెదిరించాడు. నీలు కుటుంబసభ్యుల్ని కూడా కత్తితో బెదిరించాడు.
అయితే, పరువు పోతుందన్న భయంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. రాహుల్ బెదిరింపులతో నీలు తీవ్ర మనోవేధనకు గురైంది. అతడినుంచి తప్పించుకోవటానికి చావొకటే మార్గం అనుకుంది. పెళ్లికి ఓ రోజు ఉందనగా ఇంటికి దగ్గరలోని కిషోర్ సాగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఉదయం ఐదు గంటల నేపథ్యంలో నిద్రలేచిన కుటుంబసభ్యులకు నీలు కనిపించలేదు. ఆమె కోసం చుట్టూ వెతికారు. కానీ, కనిపించలేదు. దీంతో ఆమె ఫోన్‌కు కాల్ చేశారు. ఫోన్ రింగవుతున్నా ఎవరూ తీయట్లేదు. కొద్ది సేపటి తర్వాత చెరువు దగ్గర ఫోన్‌ను గుర్తించారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాహుల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Guntur: భార్య వివాహేతర సంబంధం.. భర్త సెల్ఫీ సూసైడ్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.