Crime News: చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని శిక్షించటం ఈ మధ్య ఎక్కువయిపోయింది. నేరం చిన్నదా.. పెద్దదా.. అసలు శిక్షించే హక్కు మనకుందా? లేదా?.. అన్నది ఆలోచించకుండా కొంతమంది జనం దారుణాలకు పాల్పడుతున్నారు. వివాహేతర సంబంధాలకు పాల్పడుతున్న వారిని, దొంగతనం చేసిన వారిని క్రూరంగా హింసిస్తున్నారు. తాజాగా, ఓ యువకుడు గోధుమలు దొంగతనం చేశాడన్న కారణంతో కొందరు వ్యక్తులు అతడిని కఠినంగా శిక్షించారు. బట్టలు ఊడ దీసి, విచక్షణా రహితంగా కొట్టారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాకు చెందిన ఓ యువకుడు కొద్దిరోజుల క్రితం ఓ ఇంట్లో గోధుమలు దొంగతనం చేశాడు.
కొంతమంది వ్యక్తులు ఆ యువకుడ్ని పట్టుకున్నారు. విచక్షణా రహితంగా అతడిపై దాడి చేశారు. బాధితుడి బట్టలు ఊడ దీశారు. బూతులు తిడుతూ, మరోసారి కొట్టారు. దీన్నంతా వీడియో తీశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. యువకుడిపై దాడి చేయటాన్ని తప్పుబట్టారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని సంఘటన జరిగిన ప్రాంత పోలీసులను ఆదేశించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడికి తెగబడ్డ వారిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని అన్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : గిన్నెలు కడగలేదని రూమ్ మేట్ ని కత్తితో పొడిచిన యువకుడు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.