నేటి కాలంలో వివాహేతర సంబంధాల కారణంతో ఎన్నో వైవాహిక జీవితాలు రోడ్డున పడుతున్నాయి. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు ఎంచక్కా వివాహేతర సంబంధాల్లో పాలు పంచుకుని పచ్చని సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ భర్త భార్యకు తెలియకుండా అక్రమ సంబంధాన్ని ఏర్పరుచుకుని చివరికి ప్రియురాలిని రెండో పెళ్లి చేసుకున్నాడు. తాజాగా మధ్య ప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ ప్రాంతం. ఓ మహిళకు గతంలో ఓ యువకుడితో వివాహం అయింది. కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. అయితే ఇటీవల ఈ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ మహిళ పుట్టింటికి వెళ్లింది. దీనిని ఆసరాగా చేసుకున్న భర్త ఓ యువతితో పరారై పెళ్లి చేసుకుని ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ విషయం తన భార్యకు తెలిసింది. దీంతో ఆ మహిళ నాకు న్యాయం చేయాలంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇది కూడా చదవండి: Bhadradri Kothagudem: పదేళ్ల కిందట ప్రేమ వివాహం! పూజారి వద్ద శిష్యరికం చేస్తూ చివరికి!
నా భర్త గత కొంత కాలం నుంచి వివాహేతర సంబంధాన్ని నడిపిస్తున్నాడని, అదే యువతిని ఈ మధ్య పెళ్లి కూడా చేసుకున్నాడని తెలిపింది. నాకు తెలియకుండా నా భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని, నాకు మీరే న్యాయం చేయాలని వేడుకోంది. అయితే నా భర్త పెళ్లికి అత్తామామల సాయం కూడా ఉందని ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.