ఇంటర్ చదివే రోజుల్లో వారిద్దరు స్నేహితులు. రోజులు గడిచే కొద్ది వారి స్నేహం ప్రేమగా మారింది. దీంతో ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా మారిపోయారు. ఇక ఒకరు అమ్మాయిగా మారి పెళ్లి కూడా చేసుకోవాలనుకుని ఆరేళ్ల పాటు సహజీనం చేశారు. దీంతో ప్రియుడు ఉన్నట్టుండి నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని, వంశవృద్ధి కోసం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటూ షాక్ ఇచ్చాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి న్యాయం కోరుతోంది.
అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు మీ కోసం. అది ఏపీలోని మదనపల్లి మండలం వెంగంవారిపల్లె. ఇదే గ్రామానికి చెందిన లోకేష్ కు ములకలచెరువు మండలం పత్తికోటకు చెందిన మహేష్‌తో పరిచయమేర్పడింది. వీరిద్దరు మదనపల్లిలో ఇంటర్ చదివారు. అప్పటి నుంచి వీరు ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. ఇక రోజులు గడిచే కొద్ది వీరి స్నేహం ప్రేమగా మారింది. దీంతో ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా మారిపోయారు. ఇక చివరికి ఇద్దరు పెళ్లిచేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Bihar: భార్య వివాహేతర సంబంధం.. కరెంట్ పోల్ కి కట్టేసి చితకబాదిన భర్త!
దీంతో లోకేష్‌ను అమ్మాయిగా మారాలని మహేష్ కోరాగ లోకేష్ శస్త్రచికిత్స చేయించుకుని స్వీటీగా మారిపోయాడు. ఇక ఇద్దరూ కలిసి ఆరేళ్లపాటు సహజీవనం చేశారు. ఉన్నట్టుండి ప్రియుడు మహేష్.. నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని, వంశవృద్ధి కోసం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని స్వీటితో తెగదెంపులకు రెడీ అయ్యాడు. దీంతో మహేష్ మాటలు విన్న స్వీటి ఒక్కసారిగా షాక్ కు గురైంది. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. మహేష్ తనను కాకుండా వేరొకరిని పెళ్లిచేసుకోవడం ఇష్టం లేదని, అతని కోసం మగతనాన్ని త్యాగం చేసిన తనకు అతడితోనే పెళ్లి జరిపించి న్యాయం చేయాలంటూ తన గోడును వెళ్లబోసుకుంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరినీ విచారిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.