ఆమె భర్తతో విభేదాల కారణంగా ఆసుపత్రిలోనే ఉంటోంది. అప్పుడప్పుడు ఇంటికి వెళుతోంది. రుచి మరణంపై ఆమె భర్త పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు.
ఆమె ఓ డాక్టర్. ఓ ప్రముఖ ఆసుపత్రిలో జనరల్ ఫిజిషియన్‌గా పని చేస్తోంది. తన వైద్య సేవలతో ఆమె ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. తోటి వైద్యులతో ఎంతో హుందాగా వ్యవహరించేది. అలాంటి ఆమె.. ఏమైందో తెలీదు కానీ, దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఓ రాత్రి ఆసుపత్రిలోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన రుచి సక్సేనా ఎవాన్ ఆసుపత్రిలో జనరల్ ఫిజిషియన్‌గా పని చేస్తోంది. ఆమె భర్తతో విభేదాల కారణంగా ఆసుపత్రిలోనే ఉంటోంది.
అప్పుడప్పుడు ఇంటికి వెళుతోంది. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి ఆమె తన గదిలో ఉరి వేసుకుంది. సీలింగ్‌కు దుపట్టాతో ఉరి బిగించుకుని ప్రాణాలు తీసుకుంది. గదిలో రుచి శవాన్ని గుర్తించిన ఆసుపత్రి యజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రుచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రుచి భర్త ములాయంను విచారించారు.
సోను, విద్యా సాగర్, పంకజ్‌లు తమ అనుచరులతో కలిసి తన భార్యను చంపేశారని ములాయం ఆరోపించాడు. రుచిని హత్య చేసిన తర్వాత శవాన్ని సీలింగ్ వేలాడదీశారని అన్నాడు. ఇక, పోస్టుమార్టం రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రుచి గురువారం ఉదయం 3 గంటల ప్రాంతంలో చనిపోయినట్లు తేలింది. పోలీసులు రుచి మరణం ఆత్మహత్యా? లేక హత్యా? అన్న కోణాల్లో విచారణ చేపట్టారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.