నేటి కాలంలో కొందరు వివాహేతర సంబంధాల్లో తలదూర్చి నిండు జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త. ఇలా అక్రమసంబంధాల్లో చిక్కుకుని చివరికి హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి విషాద ఘటనే ఒకటి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. అది పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామం. క్రిష్ణవేణి, బాలయ్య భార్యాభర్తలు. వీరికి పెళ్లై దాదాపుగా 12 ఏళ్లు గడిచింది. వీరికి ఓ కూతురు, కుమారుడు కూడా ఉన్నారు. దీంతో వారి జీవితం సుఖసంతోషాలతో హాయిగా సాగింది.
ఈ క్రమంలోనే అదే గ్రామంలో ఉంటున్న ధర్మయ్య అనే వ్యక్తితో క్రిష్ణవేణి అక్రమసంబంధానికి ఒడిగట్టింది. దీంతో వీళ్లిద్దరూ భర్తకు తెలియకుండా తెరవెనుక సంసారానికి తెరలేపారు. అలా కొన్నాళ్లపాటు వీరి వివాహేతర సంబంధం బలంగా సాగింది. దీంతో ప్రియుడిపై మోజుతో క్రిష్ణవేణి ఈ మధ్య కాలంలోనే ధర్మయ్యతో కలిసి ఇద్దరు మెల్లగా జారుకుని ఊరు వదలివెళ్లిపోయారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న క్రిష్ణవేణి భర్త బాలయ్య ఆగస్టు 27న ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇక అదే గ్రామంలోని వజ్రమ్మ అనే మహిళ ఊరెళ్లి వచ్చి తన ఇంటి తలుపులు తీయగా కుల్లిపోయిన ఇద్దరు శవాలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న వజ్రమ్మ పోలీసులకు సమాచారం అందించింది. ఇక స్థానికుల సమాచారం ప్రకారం కుల్లిపోయిన శరీరాలు మాత్రం క్రిష్ణవేణి ధర్మయ్యగా గుర్తించారు గ్రామస్తులు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరి మరణం వెనుక మిస్టరీని రాబట్టేందుకు విచారణ చేపడుతున్నారు. ఇక భార్యాభర్తల మరణంతో క్రిష్ణవేణి, బాలయ్య దంపతుల కూతురు, కుమారుడు ఆనాధలై కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.