Narayanpet: ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవటానికి ఆ యువకుడు నో చెప్పాడు. పెద్దల పంచాయితీలో.. అందరిముందు తనను పెళ్లి చేసుకోవటానికి నో చెప్పటంతో ప్రియురాలు భరించలేకపోయింది. ఇంటికిపోయి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలి మరణంతో భయపడిపోయిన ఆ యువకుడు రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లాలోని కోస్గి పట్టణానికి చెందిన పావని(18) హైదరాబాద్‌లో చదువుతోంది. కోస్గి ప్రాంతానికి చెందిన నరేందర్(19) స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్‌లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. గత కొన్ని నెలల నుంచి వీరు ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాలు ఈ నెల 7న పెద్ద మనుషులతో పంచాయితీ పెట్టించారు.
ఈ పంచాయితీ సందర్భంగా నరేందర్, పావనిని పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. ప్రేమించిన వాడు పెద్దల ముందు పెళ్లికి నో చెప్పటంతో పావని తట్టుకోలేకపోయింది. ఇంటికి పోయి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కుటుంబసభ్యులు ఆమెను పాలమూరు ఆసుపత్రికి.. ఆ తర్వాత హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
పావని ఆత్మహత్య చేసుకోవటంతో నరేందర్ భయపడిపోయాడు. తనను ఏమన్నా చేస్తారన్న భయంతో శనివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Hyderabad: రివాల్వర్‌తో బెదిరిస్తూ.. మహిళపై నీచానికి పాల్పడ్డ మారేడుపల్లి సీఐ..!