నేటి కాలంలో మారుతున్న కాలానికి అనుగుణంగా యువత ఆలోచనల్లో మార్పు సంభవిస్తుంది. తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడడం, ఇంట్లోకి వాళ్లకి తెలియడంతో పారిపోవడం చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే ఒడిశాలో చోటు చేసుకుంది. దీంతో మహిళా పోలీసులు పెళ్లి పెద్దల్లా మారి దగ్గరుండి ఆ ప్రేమ జంటకు పెళ్లి చేశారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. జయపురం మండలం కందులగుడ గ్రామానికి చెందిన గాయిత్రీ అనే యువతి, కుంద్రా సమితి పుప్పుగాం పంచాయతీ జబాపాత్రోపుట్ గ్రామానికి చెందిన లోక్‌నాథ్ కందిలియా అనే యువకుడితో ప్రేమలో పడింది.
దీంతో కొంత కాలం నుంచి ఇద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. అయితే ఇటీవల ఈ విషయం ఇద్దరి తల్లిదండ్రులకు తెలియటంతో ఇంట్లోని నుంచి పారిపోయారు. యువతి తండ్రి నా కుమార్తెను లోక్‌నాథ్ కందిలియా యువకుడు తీసుకెళ్లిపోయాడని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక ఎట్టకేలకు పోలీసులు రంగంలోకి దిగి ఆ ప్రేమ జంటను పట్టుకుని స్టేషన్ కు తీసుకొచ్చారు. ఆ ప్రేమ జంట పోలీసులు మందు.. మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని, ఒకరిని విడిచి మరొకరం ఉండలేమని తెగేసి చెప్పారు. దీంతో వీరి నిర్ణయాన్ని స్వాగతించిన పోలీసులు ఇద్దరూ కూడా మైనర్లు కావడంతో ఇరువురి తల్లిదండ్రులను ఒప్పించారు. అనంతరం స్థానిక దేవుడి గుడిలో పోలీసులే దగ్గరుండి ఆ ప్రేమ జంటకు వివాహం జరిపించారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమవుతోంది.