Love Affair : ప్రేమించిన వాడితో పెళ్లి కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూసింది. వాయిదాల పర్వంతో మనసు నొచ్చుకుంటున్నా.. అన్నీ ఓర్చుకుంది. పెళ్లి వార్త చెబుతాడుకున్న ప్రియుడు మరోసారి వాయిదా వేయటంతో తట్టుకోలేక పోయింది. చివరకు ప్రాణం తీసుకుంది. కన్నవాళ్లను, నాలుగేళ్ల ప్రేమను, ప్రియుడ్ని వదిలి వెళ్లిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నిడమనూరు మండలం, బొక్క ముంతలపాడు గ్రామానికి చెందిన 25 ఏళ్ల మనీష దగ్గరి బంధువైన మిర్యాల గూడ మండలం అన్నపురెడ్డి గూడెనికి ఎందిన బోదల రాజేశ్ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని మనీష కుటుంబసభ్యులకు రాజేశ్ మాటిచ్చాడు. అయితే, నెలలు గడుస్తున్న అతడినుంచి పెళ్లి మాట రాకపోవటంతో ఓ రోజు ఇంటికి పిలిచారు.
పెళ్లి విషయం అడిగారు. ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలన్నారు. తన కుటుంబసభ్యుల్ని ఒప్పిస్తానని, దానికి కొంత సమయం కావాలని అన్నాడు. మనీషకు ఏదైనా సంబంధం వస్తే చెడుగొడుతున్నాడు. ఈ నేపథ్యంలో మనీష తీవ్రమనస్తాపానికి గురైంది. గురువారం తల్లి ఇంట్లో లేని సమయంలో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన తల్లి ఎంత కొట్టినా తలుపు తెరుచుకోలేదు. పొరిగింటి వాళ్లను పిలిచి తలుపు బద్ధలు కొట్టగా.. మనీష ఉరికి వేళాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. తన కూతురు చావుకు రాజేశ్ కారణమని మనీష తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : లవర్‌తో వీడియో కాల్.. లైవ్‌లో ఉరి డ్రామా.. పాపం విధి వక్రించి..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.