Medchal: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూలు ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల మేరకు.. మేడ్చల్ జిల్లా చర్లపల్లి దగ్గర ఓ లారీ స్కూలు ఆటోను ఢీకొట్టింది. లారీ ఢీకొన్న వేగానికి ఆటో నుజ్జునుజ్జయింది.
దీంతో అందులోని ఇద్దరు స్కూలు పిల్లలు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ చిన్నారులను చికిత్స కోసం హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.