గత కొంత కాలంగా దేశంలో రోజుకు పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో కొంత మంది చనిపోతే.. మరికొంత మంది అంగవైకల్యంతో జీవితాలను నెట్టుకొస్తున్నారు. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొంత మంది డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఇదేంటని ప్రశ్నించిన వారిపై కత్తితో దాడికి యత్నించాడు. వివరాల్లోకి వెళితే..
ఆదిలాబాద్ జిల్లలో ఒక లారీ డ్రైవర్ రాంగ్ రూట్ లో నిర్లక్ష్యంగా నడుపుకుంటూ వచ్చాడు. దాంతో అటుగా వస్తున్న వాహనదారులు ఆందోళన చెందారు. గ్రామస్థులు ఆ లారీని ఆపి డ్రైవర్ ని ఇదేం డ్రైవింగ్.. ఇలా ర్యాష్ గా నడిపి ఎవరి ప్రాణాలు తీస్తావు అని అడిగారు. అంతే డ్రైవర్ వెంటనే తన లారీలో ఉన్న ఒక తల్వార్ ని తీసుకు వచ్చి వారి మీదికి దూసుకు వెల్లాడు. అంతేకాదు గ్రామస్థులను బండ బూతులు తిడుతూ నా ఇష్టం నేను అలాగే లారీ నడుపుతాను.. ఎవడేం చేస్తాడో చేసుకోండి అంటూ బెదిరించాడు.
ఇక గ్రామస్థులకు సహనం నశించింది.. ఆ డ్రైవర్ ని పట్టుకొని పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. కొంతమంది వాహనదారులు, గ్రామస్థులు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు డ్రైవర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ర్యాష్ డ్రైవంగ్ చేస్తూ.. జనాల ప్రాణాల మీదకు తీసుకు వచ్చే డ్రైవర్ల పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.