ఆత్మహత్య.. ఈ మధ్యకాలంలో ఈ పదం బాగా వినిపిస్తోంది. తల్లి తిట్టిందని, నాన్న కొట్టాడని, పరీక్షలో తప్పానని, లవ్ ఫెయిల్ అయ్యిందని ప్రతిచిన్న కారణానికి చావే శరణ్యం అనుకుంటున్నారు. చిన్న వాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో మందిది ఇదే తీరు. అలాంటి వాళ్లకు, విద్యార్థులకు ధైర్యం చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు పాల్పడింది. తాను ఉండే కళాశాల హాస్టల్‌లోనే ప్రాణాలు తీసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. చందన(26) మైసూరులోని జేఎస్‌ఎస్ కళాశాలలో సైన్స్ లెక్చరర్‌గా పనిచేస్తోంది. అంబళై గ్రామానికి చెందిన రేషన్ డీలర్ మహాదేవ స్వామి కుమార్తె చందన. ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు. కళాశాల వసతిగృహంలోనే ఉంటోంది. మంగళవారం ఉదయం చందన ఎంతకీ గది నుంచి బయటకు రాకపోవడంతో విద్యార్థినులు తలుపు కొట్టారు.
ఎంత కొట్టినా చందన తలుపు తీయకపోవడంతో విద్యార్థినులు కిటికీ లోనుంచి చూడగా ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె సూసైడ్ నోట్ కూడా రాసి పెట్టింది. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ ఆ లెటర్‌లో రాసింది. అదే రోజు చందన పుట్టినరోజు కూడా కావడంతో అంతా ఉద్వేగానికి గురయ్యారు. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనేది మాత్రం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.