మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన ఆరోపణల నేపథ్యంలో నాగేశ్వరరావుపై అత్యాచారం, హత్యాయత్నం, ఆర్మ్స్ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నాగేశ్వర్ రావును విధుల నుంచి తప్పిస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
మారేడ్‌పల్లి పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న నాగేశ్వర్‌రావు తనపై అత్యాచారం చేశాడని బాధిత మహిళ వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తపైనా దాడి చేశారని ఆమె పేర్కొంది. ఈ మేరకు వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ నాగేశ్వర్‌రావు.. బాధితురాలు, ఆమె భర్తను కారులో బలవంతంగా తీసుకువెళ్తుండగా ఇబ్రహీంపట్నం వద్ద కారు ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలో తప్పించుకున్న బాధితురాలు, ఆమె భర్త.. పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు సదరు సీఐపై అత్యాచారం కేసు నమోదు చేశారు.
బాధితుల కథనం ప్రకారం.. నాగేశ్వర్ రావు ఈ నెల 7వ తేదీన హస్తినాపురం శ్రీ వెంకటేశ్వర కాలనీలో నివాసముంటున్న ఓ మహిళ ఇంటికి వెళ్లాడు. రాత్రి సమయంలో భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే వారి ఇంట్లోకి.. సీఐ ప్రవేశించాడు. భర్త తిరిగొచ్చే వరకు భార్యపై సీఐ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కాసేపటికి ఇంటికి చేరుకున్న భర్త, తన భార్యపై అత్యాచారం చేస్తున్న సీఐని అడ్డుకున్నాడు. దీంతో బాధితురాలి భర్తను సీఐ రివాల్వర్‌తో బెదిరించాడు. అర్ధరాత్రి సమయంలో ఆ దంపతులిద్దరిని కారులో ఎక్కించుకుని ఇబ్రహీంపట్నం వైపు బయల్దేరాడు. అయితే కారు రోడ్డుప్రమాదానికి గురవడంతో.. సీఐ నుంచి దంపతులిద్దరూ తప్పించుకుని, వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Chintamani: చాలా రోజులుగా ఆమె ఆనందంగా లేదు! తీరా హాస్టల్ గదిలో!
ఇది కూడా చదవండి: డబ్బుల కోసం భార్యను స్నేహితుల పక్కలోకి పంపిన భర్త!