మహిళల కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా వారిపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ఇలాంటి కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు కఠిన శిక్షలు విధిస్తున్నా.. మహిళల పట్ల వక్రబుద్ధి మాత్రం మారటం లేదు. వయసుతో సంబంధం లేకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఒంటరిగా కనిపిస్తే చాలు వారిని చిదిమేస్తున్నారు. నిత్యం ఏదో ఒకచోట వారిపై లైంగిక దాడులు, అత్యాచారాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి మరొకటి వెలుగులోకి వచ్చింది. ఒంటరిగా చిన్నారిని.. అన్నం పెడతానని ఇంట్లోకి తీసుకెళ్లిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లాకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక, తల్లిదండ్రులు ఉపాధి పని నిమిత్తం బయటికివెళ్లగా తను ఇంటివద్దనే ఉంటోంది. ఇది గమనించిన పక్కింటి వ్యక్తి రమేష్(44 ఏళ్లు).. భోజనం పెడతానని బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను అక్కడే వదిలేసి తనకేం తెలియదు అన్నట్లుగా అక్కడనుండి చిన్నగా జారుకున్నాడు.
ఇది కూడా చదవండి: Nellore: రైల్వే కానిస్టేబుల్ వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య!
బాలిక తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి చిన్నారి ఏడుస్తూ కనిపించింది. ఎందుకు ఏడుస్తున్నావ్ అని తల్లిదండ్రులు అడగ్గా.. బాలిక తనపై జరిగిన ఘోరాన్ని తల్లికి చెప్పింది. జరిగిన విషయం తెలిసుకొన్న తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి.. బాలికను చికిత్స నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికపై అత్యాచారం జరిగినట్లుగా వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.