తల్లిదండ్రుల వేధింపులు భరించలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకు దారితీసిన కారణాలను వాట్సప్ స్టేటస్‌లో వివరించాడు. ‘నా చావుకు కారణం.. నా తల్లిదండ్రులే!’ అంటూ ఆత్మహత్య చేసుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగరాజు అనే వ్యక్తి స్థానికంగా బంగారం వ్యాపారం చేస్తుంటారు. ఈయనకు తరుణ్(26) అనే కుమారుడు ఉన్నాడు. గత కొంత కాలంగా తల్లిదండ్రులు, కొడుకు మధ్య పెళ్లి విషయమై గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో తల్లిదండ్రుల ప్రవర్తనతో విసిగిపోయిన తరుణ్ వేధింపులు భరించలేక తన రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. తనది ఆత్మహత్య కాదు, తల్లిదండ్రులు చేసిన హత్యగా భావించాలని తరుణ్ వాట్సప్ స్టేటస్ మెసేజ్‌లో ప్రస్తావించాడు. “పెళ్లి కుదిరిందని, అయితే తల్లిదండ్రులు డబ్బు మోజులో పడి రద్దు చేశారని ఆరోపించాడు. డబ్బు కోసం తనను మానసికంగా, శారీరకంగా హింసించారని, పలుమార్లు తనను కొట్టారని, ఇంటిలోనే బంధించారని మెసేజ్‌లో రాసుకొచ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: kolkata: కాబోయే భార్యకు సర్ ప్రైజ్ గిఫ్ట్.. హోటల్ కు తీసుకెళ్లి ఊహించని గిఫ్ట్!