సమాజంలో రోజురోజుకు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే సభ్య సమాజం సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. తాజాగా వ్యభిచారం చేస్తున్న భార్యను.. ఆ పని మానుకోవాలి అన్నాడు భర్త. దాంతో నా పనికే అడ్డు చెప్తావా అని.. భర్తను చంపి గోనె సంచిలో కుక్కింది ఓ భార్యామణి. సంచలనం రేపిన ఈ ఘటన హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తన స్నేహితురాలితో కలిసి ఈ దారుణానికి ఒడి గట్టింది భార్య.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాపూర్ నగర్ సంజయ్ గాంధీ నగర్ కు చెందిన సురేష్-రేణుక భార్యభర్తలు. సురేష్ ఆటో డ్రైవర్ గా పని చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక రేణుక గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారాన్ని నిర్వహిస్తోంది. ఈ విషయం తెలిసిన సురేష్.. తరచు ఆమెతో గొడవ పడుతుండే వాడు. ఆమెను వ్యభిచారం మానుకోవాలని చాలా సార్లు చెప్పి చూశాడు. దాంతో సురేష్ ను ఎలాగైన అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ వేసింది. ఆదివారం భర్తకు మద్యం తాగించి తాను కూడా తాగింది. ఇక మద్యం మత్తులో ఉన్న భర్త సురేష్ మెడకు స్నేహితురాలు దేవి సాయంతో చున్నీ బిగించి హత్య చేశారు. అనంతరం బాడీని గోనె సంచిలో కుక్కి ఇంటి ముందు పార్క్ చేసిన ఆటో పక్కన పడేశారు.
ఇక సోమవారం తెల్లవారు జామున పక్కనే ఉన్న కిరాణా షాపు యజమాని ఈ గోనె సంచిని గుర్తించాడు. దాంట్లో ఉన్న సురేష్ మృతదేహాన్ని చూసి భార్యకు సమాచారం ఇచ్చాడు. దాంతో మెుసలి కన్నీరు కారుస్తూ.. పోలీసులకు ఫిర్యాదు భార్య. తన భర్త రాత్రి స్నాక్స్ కోసం బయటకి వెళ్లి తిరిగిరాలేదని ఫిర్యాదులో తెలిపింది. అయితే ఆమె తీరుపై పోలీసులకు అనుమానం రావడంతో తమదైన స్టైల్లో విచారించారు పోలీసులు. దాంతో అసలు విషయం బయటకు వచ్చింది. తనను వ్యభిచారం వద్దు అన్నందుకే భర్త సురేష్ ను చంపినట్లు అంగీకరించింది. సురేష్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.