అతడు ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. జీవితాంతం తోడుగా ఉంటానని మాట ఇచ్చాడు. కొన్నాళ్లు తరువాత మరో యువతిపై మోజు పడ్డాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను మరచిపోయి ఆ యువతి పెళ్లి చేసుకున్నాడు. అడ్డుగా ఉందని ప్రేమించిన భార్యను అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఈఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం జోడిమెరక గ్రామానికి చెందిన జోడి నాగరాజు, లక్ష్మి(26) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఐదేళ్ల బాబు ఉన్నాడు. కొన్నేళ్ల పాటు వీరి సంసారం చక్కగా సాగింది. అనంతరం మరో యువతితో ప్రేమలో పడ్డాడు నాగరాజు. ఆమెతో నిత్యం ప్రేమ మైకంలో తేలిపోయాడు. మొదటి భార్యకు తెలియకుండా ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో మరొక ప్రాంతంలో వేరే కాపురం పెట్టాడు. విషయం తెలుసుకున్న లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరువురికి సర్థి చెప్పి పంపించారు. కానీ నాగరాజు మనసులో ఓ చెడు ఆలోచన పడింది.