తమిళనాడు, విల్లుపురం జిల్లాలోని గింజీ గ్రామంలో దారుణ ఘటన వెలుగుచూసింది. మైనర్ బాలిక(16)పై 77 ఏండ్ల ముసలాయన సహా ఎనిమిది మంది లైంగిక దాడులకు పాల్పడ్డారు. గత ఆరు నెలలుగా ఈ దారుణం జరుగుతుండగా ప్రస్తుతం బాలిక గర్భం దాల్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తల్లి మరణించడంతో బాధిత బాలిక గింజీలోని తన అత్త ఇంట్లో ఉంటోంది. బాలిక స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలో పదకొండో తరగతి చదువుతున్నట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా బాలిక నీరసంగా ఉండటంతో ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా ఆమె ఆరు నెలల గర్భవతిగా తేలింది. ఈ విషయమై పోలీసులు బాలికను ప్రశ్నించగా ఆరు నెలల నుంచి తన కజిన్ తో పాటుగా ఎనిమిది మంది తాను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టారని తెలిపింది. సభ్య సమాజం తలదించుకునే ఈ నేరానికి పాల్పడ్డ ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.