నేటి ఆధునిక సమాజంలో మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారాయి. అలా మారడమే కాక.. వారి ప్రాణాలను సైతం బలికొంటున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. “రూపాయి.. రూపాయి నువ్వేం చేస్తావ్ అంటే? అన్నదమ్ముల మధ్య చిచ్చుపెడతాను.. భార్య భర్తలను విడగొడతాను.. హత్యలు చేయిస్తాను” అన్నదంట. ఆనలుగు సినిమాలో ఈ డైలాగ్ నేటి సమాజానికి అద్దంపడుతోంది. ఈ క్రమంలోనే ఆస్తి పంచివ్వమన్నందుకు కన్న కొడుకునే కడతేర్చాడు ఓ తండ్రి. రాష్ర్టంలో సంచలనం సృష్టించిన ఈ వార్త నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలంలోని మెండోర గ్రామంలో దండ్ల సుమన్ అతడి కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. అతడికి భార్య, 5 నెలల కొడుకు ఉన్నారు. అయితే గతంలో సుమన్ పని కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ పని చేసిన డబ్బులను తన తండ్రి రమేశ్ కు పంపించేవాడు. ఈ క్రమంలోనే సుమన్ గల్ఫ్ నుంచి ఇంటికి వచ్చాడు. ఇక అప్పటి నుంచి తండ్రీ కొడుకులకు డబ్బుల విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. నేను పంపించిన డబ్బులు నా భార్యకు ఎందుకు ఇవ్వలేదని సుమన్ తన తండ్రితో గొడవకు దిగాడు. అదీ కాక నాకు ఆస్తి పంచివ్వాలని ఇటీవల పెద్దల సమక్షంలో సైతం పంచాయతీని కూడా పెట్టారు. అయినప్పటికీ తన తండ్రి స్పందించకపోవడంతో సుమన్ కోపం పెంచుకున్నాడు.
ఈ క్రమంలోనే గ్రామంలో వినాయక నిమర్జన వేడుకలు జరిగిన తర్వాత సుమన్ అర్థరాత్రి బైక్ కోసం తన తండ్రి ఇంటికి వెళ్లాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈక్రమంలోనే తండ్రి రమేశ్ కోపంతో పక్కనే ఉన్న గొడ్డలితో సుమన్ మెడ భాగంపై నరికాడు. దీంతో అతడి మెడ భాగం సగానికి పైగా తెగింది. బాధతో సుమన్ అక్కడే కుప్పకూలి మృతి చెందాడు. హత్యను దాచే ప్రయత్నంలో భాగంగా రక్తపు మరకలను నీటితో కడిగి పరారయ్యాడు. సుమన్ భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆస్తి కోసం కన్న కొడుకునే చంపిన ఈ తండ్రిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.