భారతీయ వివాహ వ్యవస్థ చాలా గొప్పది. అందుకే మన వివాహ వ్యవస్థకు ప్రపంచ వ్యాప్తంగా గౌరవం లభిస్తోంది. కానీ నేటి కాలంలో వివాహ వ్యవస్థపై ఉన్న అభిప్రాయాన్ని ప్రస్తుతం జరుగుతున్న వరుస సంఘటనలు మారుస్తున్నాయి. భర్త ఉండగానే మరో వ్యక్తి సుఖం కోసం పాకులాడే మహిళలు కొందరైతే.. భార్య ఉండగానే మరో మహిళ సుఖం కోసం ఆరాటపడే మగాళ్లు మరికొందరు. అయితే వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన కీసర పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ కు చెందిన రమేష్-మంజుల లు భార్య భర్తలు. వీరికి ఇద్దరు కొడుకులు. ఇదే కాలనీకి కొన్ని రోజుల క్రితం బాలరాజు-మమత అనే కుటుంబం సైదాపురం అనే గ్రామం నుంచి వలస వచ్చింది. బాలరాజు రియల్ ఎస్టేట్, లిక్కర్ వ్యాపారం చేసుకునే వాడు. ఈక్రమంలో ఒకే కాలనీ కావడంతో ఇరు కుటుంబాలకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే బాలరాజుకు, మంజులకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై పలు మార్లు మంజుల భర్త రమేష్ బాలరాజును హెచ్చరించాడు.
ఇక వీరి అక్రమ సంబంధం గురించి తెలియడంతో బాలరాజు గౌడ్ భార్య మమత తన పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే బాలరాజు మంజులను తీసుకుని కొన్ని రోజులు మేడ్చల్ లో ఉన్నారు. మంజుల భర్తకు ఈ వార్త తెలియడంతో బాలరాజు తన మకాంను కీసర మండలంలోని మైత్రి కాలనీకి మార్చాడు. బాలరాజు ఇళ్లు మారిన సంగతిని కనిపెట్టిన రమేష్ ఎలాగైనా వారిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ ప్లాన్ ను తన కొడులకు, బామ్మర్థులకు వివరించాడు. అనుకున్నప్రకారం బాలరాజు ఉండే ఇంటికి అందరు చేరుకున్నారు.
రమేష్ గ్యాంగ్ మూకుమ్మడిగా బాలరాజు పై దాడి చేశారు. పక్కనే ఉన్నచున్నీతో గట్టిగా ఊరేశారు. అదీ కాక వెంట తెచ్చుకున్న కత్తి, స్క్రూ డ్రైవర్ తో దారుణంగా గొంతులో పొడిచి చంపారు. ఈ సమయంలో మంజుల పోలీసులకు ఫోన్ చేసింది. దాంతో సంఘటన జరిగిన ప్రాంతానికి పోలీసులు వచ్చి మృత దేహాన్ని గాంధీ హస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని విచరణ చేపట్టినట్లు కీసర CI రఘువీరా రెడ్డి తెలిపారు. మరి సమాజంలో రోజు రోజుకు పెరిగిపోతున్న అక్రమ సంబంధాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.