ఈ మధ్య కాలంలో కామాంధుల దారుణాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వావి వరుసలు మరిచి దారుణాలకు ఒడిగడుతున్నారు. వీరు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ఇతరుల జీవితాలు చిక్కుల్లో పడుతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే మహారాష్ట్ర, పూణెలో చోటుచేసుకుంది.
వరుసకు మరదలైన అమ్మాయిపై మనసుపడ్డ బావ ఆమె లొంగకపోవడంతో స్నానం చేస్తుండగా వీడియో తీశాడు. ఈ వీడియోని అడ్డం పెట్టుకొని తనతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవాలంటూ లేదంటే వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్ మెయిలింగ్ కు దిగాడు.
ఇది కూడా చదవండి : మైనర్‌పై 56 ఏళ్ల వ్యక్తి అఘాయిత్యం.. గర్భం దాల్చిన బాలిక
యువతి అతన్ని తిరస్కరించడంతో కొట్టి ఆమెపై హత్యాచారం చేసాడని పోలీసులు తెలిపారు. అయితే యువతి ఈ విషయాన్ని గుట్టుగా ఉంచినప్పటికీ అతడు పదే పదే వేధిస్తుండటంతో ఆమె పోలీసులను ఆశ్రయించిందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.