నేటి సమాజం ఎటు పోతుందో అర్ధం కావడం లేదు. రక్త సంబంధాలకు, మానవ విలువలకు రక్షణ లేకుండా పోతుంది. సమాజంలో కామంతో కళ్లు మూసుకుపోయి తిరిగే మృగాలతో ఆడపిల్లలు అల్లాడుతుంటే.. రక్షించాల్సిన రక్త సంబంధికులే కామంతో కాటేస్తున్నారు. తాజాగా ఓ మైనర్ బాలికపై కన్న తండ్రి, సోదరుడే లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ధారావిలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి : బీహార్ లో దారుణం.. పట్టపగలే షాపు యజమాని పై కాల్పులు జరిపిన దుండగులు!
ఇన్నాళ్ళుగా భరిస్తూ వచ్చిన బాలిక వారి వేధిపులు అధికమవ్వడంతో ఉపాధ్యాయుల సహాయంతో ఈ దారుణాన్ని భయటపెట్టింది. గత మూడేళ్ళుగా తనపై తండ్రి, సోదరుడు లైంగిక దాడికి పాల్పడ్డారని బాలిక ఉపాధ్యాయులకు తెలిపింది. ఓ సారి ఫ్యాక్టరీలో పనిలో ఉండగా తండ్రి లైంగికంగా హింసించాడని, ఇంట్లో నిద్రపోతున్న సమయంలో అన్న కూడా అఘాయిత్యానికి ఒడిగట్టాడని ఆ బాధిత బాలిక పేర్కొంది. తర్వాత ఇద్దరు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని బాలిక తను అనుభవించిన నరకాన్ని ఉపాధ్యాయులకు తెలిపింది.
అనంతరం ఉపాధ్యాయులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాధితురాలి తండ్రి, సోదరుడిపై పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఇలాంటి ఘటనలు రోజూ ఏదో ఒక చోట బయటపడుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలతో బంధాలపై ఉన్న నమ్మకం పోతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.