మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎంతో ప్రేమగా చూసుకున్న కూతురు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని ఓ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కూతురు ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో ఆమె బతికుండగానే పిండం పెట్టాడు. గుండు గీయించుకుని దినకర్మలు కూడా నిర్వహించాడు.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మద్దూరు గ్రామానికి చెందిన భార్గవి అదే గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. సమీప బంధువులే కావడంతో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ జంట పెళ్లి చేయాలని పెద్దలను కోరారు. అందుకు వారు ఒప్పుకోకపోవడంతో పెద్దలను ఎదురించి గుడిలో పెళ్లి చేసుకున్నారు.
ఇది కూడా చదవండి : పెళ్లి చూపులు ఇష్టం లేక.. ప్రాణం తీసుకున్న యువతి!
అయితే తమను కాదని, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుందని తండ్రి ఆమెపై కోపం పెంచుకున్నాడు. కూతురితో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. అంతటితో ఆగకుండా తన కూతురు చనిపోయిందంటూ గుండు గీయించుకుని ఆమెకు కర్మకాండలు జరిపించాడు. కూతురి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.