దేశంలో రోజురోజుకు హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా గానీ మహిళలపై జరుగుతున్న దారుణాలు మాత్రం ఆగటం లేదు. ఈ క్రమంలోనే దేశంలో సంచలనం రేపిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేంటంటే? అక్కా చెల్లెళ్లను హత్య చేసి.. ఇద్దరిని ఒకే చెట్టుకు వేలాడదీసిన విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. దీంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కంటికి రెప్పలా పెంచుకున్న కూతుర్లు కళ్ల ముందే ఇలా వేలాడుతుంటే.. ఏమీ చేయలేని పరిస్థితి వారిది. ఇక ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరిలో ఓ దళిత కుటుంబం నివాసం ఉంటుంది. భార్యా, భర్తలు తమ ఇద్దరి ఆడ పిల్లలతో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు అక్కా చెల్లెళ్లను గుర్తు తెలియని దుండగులు బైక్ పై వచ్చి కిడ్నాప్ చేశారని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమైయ్యారు. అలా కిడ్నాప్ కు గురైన అక్కా చెల్లెళ్లు బుధవారం లఖింపూర్ ఖేరిలోని ఓ పొలం ప్రాంతంలో చెట్టుకు ఉరితో వేలాడుతూ కనిపించారు. పేగు తెచ్చుకు పుట్టిన బిడ్డలు అలా నిర్జీవంగా చెట్టుకు వేలాడుతుంటే ఆ కన్న తల్లి భరించలేకపోయింది. తన కూతుళ్లను మనభంగం చేసి చంపి ఇక్కడ వేలాడదీశారని ఆమె ఆరోపించారు.
ఇక ఈ జంట హత్యలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. “రోజురోజుకు ఉత్తరప్రదేశ్ లో మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువైతున్నాయి.. నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హత్య జరగడం సిగ్గు చేటని.. ఇది దుర్మార్గమైన చర్య” గా సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. ఇక ఈ సంఘటనపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ట్వీటర్ ద్వారా స్పందిస్తూ..”లఖింపూర్ ఇద్దరు అక్కా చెల్లెల్ని చంపి ఇలా ఉరితీయడం చాలా దారుణమైన సంఘటన. ఈ ప్రభుత్వ హయాంలోనే మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువైయ్యాయని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.”
అయితే ఈ ఘటనపై IG లక్ష్మీ సింగ్ మాట్లాడుతూ..”స్థానికుల సమాచారంతో చెట్టుకు వేలాడుతున్న ఇద్దరి అమ్మయిల మృతదేహాలను మేం గుర్తించాం. వారి శరీరంపై ఎలాంటి గాయాలను మేం ఇప్పటి వరకైతే గుర్తించలేదు. బాడీలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించాం. పోస్ట్ మార్టం నివేదిక తర్వాత మేం మరిన్ని వివరాలు వెల్లడిస్తాం. అయితే ఈ కేసుకు సంబంధించి మేం గ్రామంలో అనుమానం ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం” అని ఆ అధికారి తెలిపారు. మరి ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ హృదయవిదారక సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Uttar Pradesh | Dead bodies of two girls were found hanging from a tree in a field outside a village in Lakhimpur Kheri. No injuries were found on the bodies. Other things to be ascertained after post-mortem. We’ll try to expedite the probe: Laxmi Singh, IG, Lucknow Range (14.09) pic.twitter.com/Uj9O5m9ldU
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 14, 2022
लखीमपुर (उप्र) में दो बहनों की हत्या की घटना दिल दहलाने वाली है। परिजनों का कहना है कि उन लड़कियों का दिनदहाड़े अपहरण किया गया था।
रोज अखबारों व टीवी में झूठे विज्ञापन देने से कानून व्यवस्था अच्छी नहीं हो जाती।आखिर उप्र में महिलाओं के खिलाफ जघन्य अपराध क्यों बढ़ते जा रहे हैं? pic.twitter.com/A1K3xvfeUI
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) September 14, 2022