మద్యం మద్యం నువ్వు ఏం చేస్తావని అడిగితే. మత్తు ఎక్కిస్తాను, ఆపై తాగినోళ్ల జీవితాలని చిత్తు చేస్తాను అని అన్నదట. మద్యం తాగడం వల్ల వచ్చే మత్తులో ఏం చేస్తున్నామో తెలియనంతగా ఒళ్ళు మర్చిపోతే ఆ సమయంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ ప్రమాదమే. ఇద్దరు వ్యక్తులు మద్యం తాగితే వచ్చే గొడవలో కోపం తారాస్థాయికి వెళ్ళిపోతే ఇద్దరి జీవితాలు నాశనమైపోతాయి. మద్యం మత్తులో చంపేందుకు కూడా వెనుకాడరు కొంతమంది. చనిపోయిన వ్యక్తే కాదు, చంపిన వ్యక్తి జీవితం కూడా ఇక్కడ నాశనమే. ఆమెకు పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కానీ భర్త సోదరుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని అతనితో వెళ్ళిపోయింది. చివరికి ఆ వ్యక్తే ఆమె పాలిట యమపాశంగా మారాడు. భర్త, పిల్లల్ని వదిలేసి వెళ్లినందుకు తగిన శాస్తి చేశాడు.
మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా మరదలిని కర్రతో కొట్టి చంపాడో బావ. ఈ ఘటన కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ కి చెందిన రామ్ కలి (25) అనే మహిళకు భోజరాజు అనే వ్యక్తితో 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే మూడేళ్ల క్రితం భర్త భోజరాజు అన్న శ్యామ్ తో సంబంధం పెట్టుకుంది రామ్ కలి. శ్యామ్ కి పెళ్లి కాకపోవడంతో రామ్ కలి తన భర్త, పిల్లలను వదిలేసి శ్యామ్ తో కలిసి 15 రోజుల క్రితం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అల్గునూర్ లో మకాం పెట్టారు.
కరీంనగర్ లోని ఒక వ్యాపారి వద్ద శ్యామ్ మేస్త్రీగా, రామ్ కలి కూలీగా పని చేస్తున్నారు. మంగళవారం నాడు ఇద్దరూ మద్యం పుచ్చుకున్నారు. మద్యం మత్తులో ఇద్దరూ గొడవ ఆడుకున్నారు. ఈ క్రమంలో బావ శ్యామ్.. తన మరదలు రామ్ కలి మీద కర్రతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో రామ్ కలి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని శ్యామ్ ని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుం పోలీసులు మృతదేహాన్ని కరీంగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.