వారిద్దరూ భార్యా భర్తలు.. పెళ్లి తర్వత కొన్నాళ్లు బాగానే ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి భర్త తాగుడుకు బానిసగా మారాడు. దాంతో భార్య తాగుడు మానండి అని రోజూ వాదించేది. ఇక తన అలవాట్లకు అడ్డు చెబుతోంది అని కట్టుకున్న భార్యపైనే దాడి చేశాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల గ్రామానికి చెందిన సంజీవులు(29)కు 6 సంవత్సరాల క్రితం సర్వాపూర్ గ్రామానికి చెందిన రమ్య శ్రీతో వివాహం జరిగింది. ఇక వివాహ అనంతరం కొన్ని రోజులు వీరి వైవాహిక జీవితం బాగానే సాగింది. అయితే సంజీవులు కుటుంబం గడవడానికి ఏ పనీ చేసే వాడు కాదు. ఊర్లో జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో రమ్యశ్రీ మద్యం మానాల్సిందిగా తరచూ చెబుతూ ఉండేది.
ఇదే విషయం మీద ఆమె గొడవ పెట్టుకుని గతంలో పుట్టింటికి సైతం వెళ్లింది. పెద్దలు నచ్చజెప్పడంతో అతడు మారతాడు అని నమ్మి రమ్యశ్రీ మళ్లీ వచ్చింది. అదే ఆమె చేసిన పెద్ద తప్పు. గురువారం మద్యం తాగొచ్చిన సంజీవులు భార్యతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం తారా స్థాయికి చేరడంతో ఆవేశంలో రమ్యశ్రీని గొడ్డలితో తల నరికి చంపాడు. తర్వత అతడు కూడా తలపై నరుక్కుని ఆ మత్తులోనే తండ్రిని కూడా చంపుతా అంటూ పొలం వైపు వెళ్తూ మధ్యలోనే పడిపోయాడు.
సంజీవులును స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే రమ్యశ్రీ 6 నెలల గర్భిణీ. వీరికి మూడేళ్ల కూతురు కూడా ఉంది. తల్లి దండ్రులను కోల్పోయిన ఆ పిల్ల ఏడుపులకు చూసే వారి కంట కన్నీరు ఆగలేదు. మరి క్షణికావేశంలో కుటుంబాన్నే నాశనం చేసుకుంటున్నా ఇలాంటి సంఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.