నగరంలో తొలిసారి ఓ చైన్ స్నాచర్ మూడు కమిషనరేట్ల పోలీసులకు సవాల్ విసిరాడు. బుధవారం సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఆరు నేరాలు చేశాడు. ఐదు చోట్ల తన ప్రయత్నానికి ఫలితం రాగా.. మరో ప్రాంతంలో ప్రయత్నం ఫలించలేదు. పేట్‌బషీరాబాద్, మారేడ్‌పల్లి, తుకారాంగేట్, మేడిపల్లి ఠాణాల పరిధిలో కేవలం ఐదున్నర గంటల వ్యవధిలోనే ఈ ఉదంతాలు చోటుచేసుకున్నాయి.
జర్కిన్ వేసుకున్న యువకుడు తలకు టోపీ, ముఖానికి మాస్క్ ధరించి.. యాక్టివా వాహనంపై తిరుగుతూ ఈ నేరాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఆధారాలతో ముందుకెళ్తున్నాయి. నిందితుడు వినియోగించిన యాక్టివా వాహనం మంగళవారం మధ్యాహ్నం ఆసిఫ్‌నగర్ పరిధిలో చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు.
ఇది కూడా చదవండి : స్టార్ హీరోయిన్ ఇంట చోరీ! నమ్మిన వ్యక్తే ముంచేశాడు!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చైన్ స్నాచర్ అదను చూసుకుని, పెద్దగా గస్తీ లేని ప్రాంతాల్లో సంచరిస్తూ వరుసగా మూడు కమిషనరేట్ల పరిధిలో చెలరేగిపోయాడు. సైబరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీలో మొదట చైన్ స్నాచింగ్ పాల్పడ్డాడు. అక్కడ నుంచి రాఘవేంద్ర కాలనీ, శ్రీరామ్‌నగర్ కాలనీల్లో సంచరిస్తూ.. హైదరాబాద్ కమిషనరేట్‌లో ప్రవేశించి మారేడుపల్లి ఠాణా పరిధిలోని ఇంద్రపురి రైల్వే కాలనీలో పంజా విసిరాడు. అక్కడినుంచి తుకారాంగేట్ పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న సమోసా గార్డెన్స్ వద్ద స్నాచింగ్ చేశాడు. చివరగా రాచకొండ కమిషనరేట్‌లోని మేడిపల్లి పరిధిలో ఉన్న బోడుప్పల్ లక్ష్మినగర్ కాలనీలో చైన్ స్నాచింగ్ పాల్పడ్డాడు .
బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మొదటి ఘటన జరిగితే ఆ ప్రాంతానికి 22.3 కి.మీ దూరంలో సాయంత్రం 4.30 గంటలకు చివరి ఘటన చోటుచేసుకుంది. మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీసులు చైన్ స్నాచర్ కోసం రంగంలోకి దిగారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌తో పాటు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ లకు చెందిన స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ పోటాపోటీగా గాలిస్తున్నాయి. బుధవారం రాత్రి వరకు ఆయా ప్రాంతాల్లోని దాదాపు 150 సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించాయి.
చైన్ స్నాచింగ్ జరిగిందిలా..