నేటి సమాజంలో స్త్రీలకు రక్షణ లేకుండా పోతోంది. దేశంలో రోజూ ఎక్కడో ఒకచోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినప్పటికీ మృగాళ్లలో భయం, మార్పు మాత్రం రావడం లేదు. తాజాగా సోమవారం రాత్రి జరిగిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తనతో పెళ్లికి నిరాకరించి, మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందని ప్రియురాలిని దారణంగా హత్య చేశాడో కిరాతక మానవ మృగం. గొంతు కోసి విచక్షణా రహితంగా ఆమెను పొడిచి పొడిచి చంపాడు. గుంటూరు జిల్లా లో చోటుచేసుకున్న ఈ సంఘటన గుంటూరు లో సంచలనం రేపింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా పమడిముక్కల మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన తపస్వికి అదే జిల్లా ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన జ్ఞానేశ్వర్ కు కొన్ని రోజుల క్రితం ఇన్ స్టా గ్రామ్ లో పరిచయ అయ్యింది. దాంతో ఇద్దరు తరచూ సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకునే వారు. ఈ క్రమంలోనే వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది. తపస్వి ఓ వైద్య కళాశాలలో బీడిఎస్ చదువుతుండగా.. అతడు ఇంజినీరింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కొంత కాలం వీరిద్దరు గన్నవరంలో ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి.
దాంతో తపస్వి.. జ్ఞానేశ్వర్ తనను వేధిస్తున్నాడని కృష్ణా జిల్లాలో పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ అతడి నుంచి వేధింపులు తగ్గకలేదు. దాంతో తన భాదను అంత తక్కెళ్లపాడులో ఉండే తన స్నేహితురాలికి చెప్పుకొని విలపించింది. ఈ నేపథ్యంలో స్నేహితురాలు అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇద్దరి తన ఇంటికి పిలిపించుకుంది. వారితో మాట్లాడుతుండాగానే జ్ఞానేశ్వర్ తనతో తెచ్చుకున్న సర్జికల్ బ్లేడ్ తో తపస్వి గొంతు కోశాడు. దాంతో భయానికి గురైన స్నేహితురాలు కిందకి వెళ్లి చుట్టుపక్కల వాళ్లను తీసుకొచ్చింది.
అయితే అప్పటికే అతడు తలుపులు వేసి ఆమెను వేరే గదిలోకి ఈడ్చుకెళ్లి కసితీరా చంపాడు. చుట్టుపక్కల వారి సాహయంతో తలుపులు బద్దలు కొట్టి కొన ఊపిరితో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో కొద్ది సేపటికే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే నిందితుడు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అతడిని ఆపి పోలీసులకు అప్పజెప్పారు స్థానికులు. అయితే తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నానని తపస్వి చెప్పిన వెంటనే అతడు ఈ దారుణానికి పాల్పడట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.