చెన్నై, వేలూరు జిల్లాలో కొన్ని నెలల క్రితం మాజీ సైనికుడొకరు, మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం బాలిక ఏడు నెలల గర్భవతిగా తేలింది. వివరాల్లోకి వెళ్తే.. వేలూరు జిల్లా గుడియాత్తం ఇందిరానగర్‌కు చెందిన శేఖర్ (56), మాజీ సైనికుడు. ప్రస్తుతం ఇతను ఇంట్లో బియ్యపు పిండి మెషిన్ పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాడు. ఇతని భార్య గ్రామంలో పంచాయతీ వార్డు సభ్యురాలిగా ఉన్నారు. ఈ క్రమంలో శేఖర్ తమ ఊరికి సమీపంలోని గ్రామానికి చెందిన బాలికపై లైంగిక దాడి చేశాడు.
ఇది కూడా చదవండి : అర్ధరాత్రి భర్తను బంధించి.. భార్యను బెదిరించి
ప్రస్తుతం బాలిక అనారోగ్యంగా ఉండడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లారు తల్లిదండ్రులు. పరిశీలించిన డాక్టర్లు విద్యార్థినిని ఏడు నెలల గర్భిణిగా తేల్చారు. తల్లిదండ్రులు బాలికను విచారించగా శేఖర్ తనపై లైంగిక దాడి చేసినట్లు తెలిపింది. ఈ విషయమై శేఖర్‌ను ప్రశ్నించగా.. బాలికకు గర్భస్రావం చేసేందుకు రూ. 10 లక్షలు ఇస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు గుడియాత్తం మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు శేఖర్‌ను అరెస్టు చేసి వేలూర్ జైలుకు తరలించారు.