Land Dispute : తరతరాలుగా, యుగయుగాలుగా దాయాదుల మధ్య ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతూనే వస్తున్నాయి. కొట్టుకోవటం, చంపుకోవటం సర్వసాధారణమైంది. తాజాగా కొంతమంది దాయాదులు రెండు గ్రూపులుగా చీలిపోయి ఓ స్థలం కోసం కలబడి కుమ్ముకున్నాయి. కొట్టుకోవటం అంటే అలా ఇలా కాదు. ఆడ,మగ తేడా లేకుండా అందరూ ఈ ఫైట్‌లో పార్టిసిపేట్ చేశారు. ఈ ఫైట్ సీన్ మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఓ భూమి కోసం గత కొన్నేళ్లుగా కడారి భీమన్న అనే వ్యక్తి వారసుల మధ్య పోరు నడుస్తోంది. కూర్మపల్లిలోని 4 ఎకరాల స్థలం మాదంటే మాదంటూ రెండు గ్రూపులుగా మారి పోరుకు దిగారు. ఈ మేరకు కోర్టుకు కూడా వెళ్లారు.
కేసు నడుస్తోంది. బుధవారం ఓ గ్రూపు ఆ భూమని ఆక్రమించటానికి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న మరో గ్రూపు అక్కడికి వెళ్లింది. దీంతో ఇరు గ్రూపుల మధ్య గొడవ చెలరేగింది. ఆడ, మగ తేడా లేకుండా అందరూ గొడవలో పాలుపంచుకున్నారు. మగవాళ్లు కర్రలతో కొట్టుకోగా.. ఆడవాళ్లు జట్లు పట్టుకుని కొట్టుకున్నారు. కొన్ని నిమిషాల పాటు ఈ పోరు జరిగింది. తర్వాత అందరూ శాంతించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ఇరు గ్రూపుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాయాదుల గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : కశ్మీర్ ఫైల్స్ పేరిట వాట్సాప్‌లో మోసాలు.. క్లిక్ చేస్తే అంతే..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.