తాత్కాలిక సుఖాలకు కక్కుర్తిపడి కొందరు తమ పచ్చని కాపురాల్లో నిప్పలు పోసుకుంటున్నారు. ఎక్కడ చూసినా వివాహేతర సంబంధాలు. వాటి కోసం భార్య, భర్త, కన్న పిల్లలు ఇనా సొంతవారిని పొట్టన పెట్టుకున్న వారు ఎందరో. చక్కని జీవితాన్ని కటకటాల వెనుక గడుపుతున్నారు. ఇక నెల్లూరులో ఓ వైద్యుడి వివాహేతర సంబంధం అయితే రోడ్డెక్కి కొట్టుకునే దాకా వచ్చింది.
విషయం ఏంటంటే నెల్లూరులో హోమియోపతి వైద్యుడు బాల కోటేశ్వరరావుని ఓ మహిళ చొక్కా పట్టుకుని రోడ్డుపైకి లాక్కొచ్చింది. ఎందుకు ఇలా చేస్తున్నావ్. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ ప్రశ్నించింది. చూసిన జనమంతా బాలకోటేశ్వరరావు ఆమెతో తప్పుగా ప్రవర్తించాడేమో అనుకున్నారు. విషయం అది కాదు. ఆమె బాలకోటేశ్వరరావు దగ్గర పనిచేసే మహిళ. ఆమెతో కొన్నాళ్లు వివాహేతర సంబంధం నడిపించాడు. కొన్నాళ్లుగా ఆమెను దూరం పెడుతున్నాడంట. దాంతో ఆగ్రహానికి గురైన ఆ మహిళ అందరూ చూస్తుండగా బాలకోటేశ్వరరావుపై దాడి చేసింది.
ఇద్దరు పరస్పంర రోడ్డెక్కి కొట్టుకున్నారు. వారి బాగోతం అటుగా పోయో వారంతా చూస్తూ వార్నీ అని ముక్కున వేలుసుకుంటున్నారు. పరస్పరం దుర్భాషలాడుకుంటూ అందిన వాటితో కొట్టుకున్నారు. తర్వాత ఆ మహిళ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో తెగ వైరల్ అవుతోంది. మరి ఆ వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి