Hyderabad: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓలా బైకుపై వెళుతున్న డాక్టర్‌ను కారుతో ఢీకొట్టారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ సంఘటన మలక్‌పేటలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌కు చెందిన శ్రావణి ఓ ఆసుపత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. రెండు రోజుల క్రితం ఉదయం పని మీద బయటకు వెళ్లటానికి ఓలా బైక్ బుక్ చేసుకుంది. బుక్ చేసుకున్న బైకుపై వెళుతూ ఉంది. బైకు మలక్‌పేట వద్దకు రాగానే ఘోరం చోటుచేసుకుంది. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు కారుతో ఆమె ప్రయాణిస్తున్న ఓలా బైకును ఢీకొట్టారు. దీంతో శ్రావణి, ఓలా బైక్ డ్రైవర్ ఇద్దరూ కిందపడిపోయారు.
ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఓలా బైక్ డ్రైవర్ వెంకటయ్య, శ్రావణిలను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు గాయపడ్డ ఇద్దరికీ అత్యవసర వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం శ్రావణి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా కారును ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టింది.. కాసుల కోసం కక్కుర్తిపడి భర్త దారుణం!