పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు లావణ్య. వయసు 25 ఏళ్లు. గతేడాదే ఆమెకు వివాహం జరిగింది. ఇక ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టింది. కానీ, పెళ్లైన ఏడాదికే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?
ఈమె పేరు లావణ్య. కూతురుని తల్లిదండ్రులు ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేశారు. ఇక పెళ్లి వయసు రావడంతో మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని అనుకున్నారు. వాళ్లు అనుకున్నట్లుగానే ఓ వ్యక్తికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. పెళ్లిలో భాగంగా అల్లుడికి కట్న కానుకలు బాగానే ముట్టజెప్పారు. అలా పెళ్లై ఏడాది గడిచింది. అత్తింట్లో కూతురు బాగానే ఉందని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ, ఉన్నట్టుండి లావణ్య సంచలన నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లాలోని శ్రీరామ్ నగర్ లో హరీష్-లావణ్య (25) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతేడాది వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఆ దంపతుల వైవాహిక జీవితం సాఫీగానే సాగింది. అయితే లావణ్య ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది. అలా కొన్ని నెలల పాటు భర్తతో బాగానే సంసారం చేసింది. కట్ చేస్తే.. గత ఆదివారం ఇంట్లో లావణ్య ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. వెంటనే గమనించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిదని తెలుసుకున్నారు. ఇక కూతురి మరణవార్త తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు.
అనంతరం లావణ్య తల్లిదండ్రులు ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా కూతురు మరణంపై మాకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని, గత కొన్ని నెలలుగా అత్తింటివారు ఆమెను అదనపు కట్నం పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. లావణ్య మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లై ఏడాది కూడా కాలేదు అంతలోనే లావణ్య ఇలా ప్రాణాలతో లేకుండా పోవడంతో మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.