ఇతని పేరు కిషోర్. వయసు పాతికేళ్లపైనే. ఇటీవల ఇతడికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు బలవంతంగా ఓ యువతితో పెళ్లికి బలవంతంగా ఒప్పించారు. ఇష్టం లేని పెళ్లి చేస్తుండడంతో అతడు తట్టుకోలేకపోయాడు. ఇలా అయితే కాదని భావించి.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అసలేం జరిగిందంటే?
పెళ్లి.. జీవితంలోనే ఓ అతి ముఖ్యమైన గట్టం. ప్రతీ ఒక్కరూ తమకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంటారు. చాలా మంది మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకుంటుంటే.., మరి కొందరు పెద్దలను ఒప్పించి చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కొందరు తల్లిదండ్రులు ప్రేమ పెళ్లి చేయడం ఇష్టం లేక పిల్లలకు బలవంతపు పెళ్లిళ్లు చేస్తుంటారు. ఇది నచ్చని యువతి, యువకులు చివరికి ఆత్మహత్యలు చేసుకోవడం, లేదంటే ఇంట్లో నుంచి వెళ్లిపోవడం చేస్తున్నారు. అచ్చం ఇలాగే ఓ యువకుడికి తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేయాలని చూశారు. ఇది నచ్చని ఆ యువకుడు ఉన్నట్టుండి ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా నంద్యాల తూడి చెర్ల గ్రామం. ఇక్కడే లక్ష్మిదేవి, పోలయ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కిషోర్ అనే కుమారుడు ఉన్నాడు. అతడికి పెళ్లి వయసు రావడంతో తల్లిదండ్రులు వివాహం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే నంద్యాల మండలం బిళ్లలాపురం గ్రామానికి చెందిన మేనమరదలితో పెళ్లి చేయాలని ఇరువురి పెద్దలు నిశ్చయించారు. ఇటీవల నిశ్చితార్థం కూడా జరిపించినట్లు తెలుస్తుంది. ఈ పెళ్లి ఇష్టం లేదని కిషోర్ తల్లిదండ్రులకు అనేకసార్లు చెప్పి చూశాడు. అయినా వినకుండా అతడికి బలవంతంగా పెళ్లి చేయాలని చూశారు. ఇక త్వరలో పెళ్లి, ఇష్టం లేని పెళ్లి చేస్తుండడంతో కిషోర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
ఈ క్రమంలోనే కిషోర్ ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో పాటు కలిసి భోజనం చేశాడు. అందరూ జోరుగా నిద్రలోకి జారుకున్నాక.. ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక తెల్లవారుజామున తల్లిదండ్రులు నిద్రలేచి చూడగా.. కుమారుడు ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఈ సీన్ చూసిన తల్లిదండ్రలు షాక్ గురై గుండెలు పగిలేలా ఏడ్చారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోద చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఆత్మహత్య చేసుకున్న యువకుడి నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.