కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చలి మంటకోసం వేసిన మంటల్లో పడి ఓ వృద్ధురాలు చనిపోయింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే తప్పకుండా ఈ స్టోరీ చదవాల్సిందే. అది కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామం. ఇక్కడే మాల బజారమ్మ (78) అనే వృద్ధురాలు కుటుంబ సభ్యులతో పాటు నివాసం ఉంటుంది.
ఈ మధ్యకాలంలో చలి తీవ్రత కాస్త పెరగడంతో ఆ వృద్ధురాలు సోమవారం వేకువజామున ఇంటి ముంగిట చలి మంట వేసుకున్నారు. అయితే చాలా సేపు బజారమ్మ ఆ చలి మంట వద్ద కూర్చుంది. అయితే ఉన్నట్టుండి ఆ వృద్ధురాలు పైకి లేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే బజారమ్మ అదుపు తప్పి ఆ చలి మంటలో బోర్లా పడిపోయింది. ఆ క్షణంలో ఆమె మంటల్లో పడి కాలిపోయింది. దీంతో ఆమె పెద్దగా అరుపులు వేయడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆ బజారమ్మ కాపాడారు.
ఆమె సగానికి పైగా కాలిపోయింది. దీంతో బజారమ్మ కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక రెండు రోజుల పాటు చికిత్స పొందిన ఆ వృద్ధురాలు బుధవారం ప్రాణాలు కోల్పోయింది. బజారమ్మ మరణించడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.