వరకట్న వేధింపులకు బలైన ఓ మహిళా వాలంటీర్ భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. తాజాగా కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఆస్పరి మండలం కారుమంచి గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన రంగస్వామికి ఎమ్మిగనూరుకు చెందిన అంజనమ్మ (28)కు ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే అంజనమ్మ స్థానిక గ్రామ వాలంటీర్‌గా విధులు నిర్వర్తించేది. సంతోషంగా సాగుతున్న వీరి కాపురంలో భర్త భార్యను వరకట్న వేధింపులతో గురి చేసేవాడు.
కాగా వీరి పెళ్లి సమయంలో తులం బంగారం, రూ.20 వేలు కట్నంగా ఇచ్చారు. ఇది చాలదు అన్నట్లుగా భర్త మరింత డబ్బులు తేవాలంటూ భార్యను ప్రతి రోజు వేధింపులు గురి చేసేవాడు. అయితే ఇదే విషయమై ఇద్దరి మధ్య తరుచు గొడవలు కూడా జరిగేవి. దీంతో భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లింది. ఇక కొన్ని రోజుల తర్వాత భర్త అత్తింటికి వెళ్లి భార్యను వెంటతెచ్చుకున్నాడు. మరిసటి రోజు వరకట్నం వేధింపులు మళ్లీ మొదలయ్యాయి.
ఇది కూడా చదవండి: మూడు పెళ్లిళ్లు చేసుకుని మరో మహిళతో భర్త ప్రేమాయణం.. మూడో భార్య ఊహించని నిర్ణయం!
దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక కోసంతో ఊగిపోయిన భర్త రంగస్వామి అంజనమ్మను ఇనుపరాడ్డుతో కొట్టి, తాడుతో గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పక్కింటివాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.