అది ఏపీలోని నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం ఎదురుపడు గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన శంకుల జనార్దన్ అనే వ్యక్తికి తిరుమలేశ్వరి అనే మహిళను గతంలో వివాహం జరిగింది. కొంత కాలం ఇద్దరి కాపురం సాఫీగానే సాగినా పిల్లలు మాత్రం కలగలేదు. ఇదే విషయమై ఇద్దరు చాలా రోజులు లోలోల కుమిలిపోయారు. అయితే ఈ క్రమంలోనే తిరుమలేశ్వరి అనారోగ్యానికి గురైంది. ఇక పిల్లలు కలగలేదన్న బాధతో తిరుమలేశ్వరి సొంత అక్కజనకమ్మను జనార్దన్ రెండో పెళ్లి చేసుకున్నాడు.
వీరికి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. అయితే ఇద్దరి భార్యలతో వీరి కాపురం బాగనే సాగినా కొన్నాళ్లకి ఆస్తి గొడవలు భగ్గుమన్నాయి. మొదటి భార్య తిరుమలేశ్వరి ఆస్తి నా పేరు మీద రాయాలంటూ భర్తకు చెప్పింది. దీంతో రెండవ భార్యతో చర్చలు సాగించిన జనార్ధన్ మొదటి భార్యను హత్య చేయాలని పథకం రచించాడు. ఇక భార్యాభర్తలు అనుకున్నట్లుగానే మార్చి 25న రాత్రి తినే ఆహారంలో కుక్కలను చంపే విషాన్ని కలిపి తిరుమలేశ్వరికి ఇచ్చారు.
ఇది కూడా చదవండి: రెండో పెళ్లి చేసుకున్న భర్త! పక్కా ప్లాన్ తో మొదటి భార్య ఏం చేసిందో తెలుసా?
అది తిన్నఆమె సృహతప్పి పడిపోయింది. ఆ తరువాత ఇద్దరు కలిసి గొంతు నులిమి దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి బైర్లుటి ఫారెస్ట్ రేంజ్‌లోని రోళ్లపెంట ఘాట్ వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో పడేశారు. ఇక రెండు మూడు రోజులు గడిచినా తిరుమలేశ్వరి జాడ కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు జనార్దన్ నిలదీశారు. ఏం తెలియదన్నట్లుగా నటిస్తూ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిందని అందరి ముందు నమ్మబలికాడు. దీంతో అనుమానమొచ్చిన కుటుంభికులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా హత్య చేసింది భార్యాభర్తలే అని ఎట్టకేలకు ఒప్పుకున్నారు. వెంటనే ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.