కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భార్య భర్తను రోకలి బండతో కొట్టి దారుణంగా హత్య చేసింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఉదాంతం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది కృష్ణా జిల్లా ఆముదాల లంక. ఇదే ప్రాంతానికి చెందిన కల్లెపల్లి సుబ్బారావు, వీరలక్ష్మి ఇద్దరు భార్యాభర్తలు. వీరికి గతంలో పెళ్లైంది. అయితే పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు.
కానీ గత కొన్ని రోజుల తర్వాత భార్య వీరలక్ష్మి వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య గత కొంత కాలం పాటు గొడవలు కూడా జరుగుతూనే ఉన్నాయి. దీంతో అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని భావించిన భార్య భర్తను అంతమొందించాలని అనుకుంది. ఇక ఈ క్రమంలోనే శుక్రవారం మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన భార్య భర్తను రోకలి బండతో కొట్టి దారుణంగా హత్య చేసింది.
తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. దీనిపై మృతుని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. వీరలక్ష్మి అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే నా కొడుకుని హత్య చేసిందని ఫిర్యాదులో పేర్కొంది. ఇక ఇదే కాక గతంలో నా కుమారుడిని హత్య చేసేందుకు ఎలుకల మందును కూడా ప్రయోగించిందని సుబ్బారావు తల్లి ఆరోపించింది. తల్లి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. ఇక మృతుని తల్లి వాదన ఇలా ఉంటే.. భార్యమ వీరలక్ష్మి మాత్రం.., నాపై లేని పోని అక్రమ సంబంధాలు అంటగడుతున్నాడని, దీని కారణంగానే నా భర్తను హత్య చేశానని భార్య ఆరోపించింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.